నేనెప్పుడూ ధోనీ అభిమానినే! రాక్షసులు మాత్రమే ఆయన్ని ద్వేషిస్తారు... - హార్ధిక్ పాండ్యా...

Published : May 23, 2023, 03:36 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, 2023 సీజన్‌ గ్రూప్ స్టేజీలో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫైయర్‌ ఆడనుంది. ఈ సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది...

PREV
15
నేనెప్పుడూ ధోనీ అభిమానినే! రాక్షసులు మాత్రమే ఆయన్ని ద్వేషిస్తారు... - హార్ధిక్ పాండ్యా...

మొదటి క్వాలిఫైయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. గత రెండు సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచులు జరగగా మూడింట్లోనూ హార్ధిక్ పాండ్యా టీమ్ విజయం అందుకుంది...

25
dhoni hardik

ఈసారి కూడా అదే రిజల్ట్ రిపీట్ అయితే గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌కి ముందు హార్ధిక్ పాండ్యా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు...

35

‘చాలామంది మాహీ ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడని అనుకుంటారు. అయితే ధోనీతో క్లోజ్‌గా ఉండేవాళ్లకి మాత్రమే మహేంద్ర సింగ్ ధోనీ ఎలా ఉంటాడో తెలుస్తది. అతను ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ జోక్‌లు వేస్తూ ఉంటాడు...
 

45

మాహీని చూస్తూ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అతను నా స్నేహితుడు, అన్నయ్య... ధోనీతో కలిసి ఫ్రాంక్స్ చేస్తుంటా, ఛిల్ అవుతుంటా. నేనేప్పుడూ ధోనీ అభిమానినే. అభిమానులకు, క్రికెట్ లవర్స్‌కి ధోనీ ఎప్పుడూ సూపర్ స్టారే...

55

ధోనీని అసహ్యించుకోవాలంటే చాలా కష్టం, రాక్షసులు మాత్రమే మాహీ లాంటి మనిషిని అసహ్యించుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

Read more Photos on
click me!

Recommended Stories