11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌లో నలుగురు భారత కెప్టెన్లు... అప్పుడు, ఇప్పుడు ధోనీ ఒక్కడే కామన్...

First Published May 23, 2023, 3:56 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆఖరి గ్రూప్ మ్యాచ్ దాకా కొనసాగిన హై డ్రామా మధ్య గుజరాత్ టైటాన్స్, సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాయి...
 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన నాలుగు జట్లకి కూడా భారతీయ ప్లేయర్లే కెప్టెన్లుగా ఉండడం విశేషం. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో నలుగురు భారత కెప్టెన్లు ప్లేఆఫ్స్ చేరడం ఇది రెండోసారి మాత్రమే...

hardik pandya

ఇంతకుముందు 2012 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరాయి. ఢిల్లీకి వీరేంద్ర సెహ్వాగ్, ముంబై ఇండియన్స్‌కి హర్భజన్ సింగ్, కేకేఆర్‌కి హర్భజన్ సింగ్ కెప్టెన్లుగా వ్యవహరించాడు...

2012 సీజన్‌లో, 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే. 2012 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొట్టమొదటి టైటిల్ విజేతగా నిలిచింది.. 
 

ఈసారి గుజరాత్ టైటాన్స్‌కి హార్ధిక్ పాండ్యా, లక్నోకి కృనాల్ పాండ్యా, ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తున్నారు.. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌లో తొలిసారి అన్నదమ్ములు (పాండ్యా బ్రదర్స్) కెప్టెన్లుగా పోటీపడుతున్నారు.

2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి షేన్ వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆ తర్వాతి సీజన్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్... ఇలా ప్రతీ సీజన్‌లో ఒకరిద్దరు ఫారిన్ ప్లేయర్లు, ప్లేఆఫ్స్ చేరిన టీమ్స్‌కి సారథులుగా వ్యవహరించారు... 

 2022 సీజన్‌లో ఆర్‌సీబీకి ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్‌గా వ్యవహరించగా 2021లో కేకేఆర్‌కి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ చేశాడు. 
 

click me!