చెన్నైలో ధోనికి ఫేర్‌వెల్.. వచ్చే సీజన్ కూడా ఆడతాడంటూ.. సీఎస్కే సీఈవో కామెంట్స్

First Published May 15, 2023, 5:11 PM IST

MS Dhoni: కేకేఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత  ధోని, చెన్నై టీమ్ మెంబర్స్ స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ  అభిమానులకు అభివాదం చేయడం ఆ జట్టు అభిమానుల్లో కొత్త అనుమానాలను రేకెత్తించింది. 

చెన్నై  సూపర్ కింగ్స్  సారథి మహేంద్ సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  నిన్న కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత  ధోని అండ్ కో.   స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ  అభిమానులకు అభివాదం చేయడం కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నది.   

కాలికి కట్టుతో ఉన్న ధోని.. ఐపీఎల్ లో ఆడేది  చాలా తక్కువ మ్యాచ్  లే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. వాస్తవానికి ఈ సీజన్ లో  ధోని   సేన ప్లేఆఫ్స్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది. కానీ  లీగ్ దశలో మాత్రం  కేకేఆర్ తో ఆడిన మ్యాచే   చెపాక్ లో చెన్నైకి చివరి మ్యాచ్.  

Latest Videos


ప్లేఆఫ్స్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ లు కూడా ఇక్కడే జరుగనున్నా ఇక్కడ ధోని ఆడతాడా..? లేదా..? అన్నది కూడా అనుమానాంగానే మారింది. తాజాగా  ధోని  రిటైర్మెంట్ వార్తల గురించి   చెన్నై  సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్  కూడా స్పందించారు.  

కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘ధోని వచ్చే సీజన్ లో కూడా ఆడతాడని మేం బలంగా  నమ్ముతున్నాం.   చాలాకాలంగా మాకు అండగా నిలుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు..’అని   విశ్వనాథన్ చెప్పాడు.  

కాగా ధోని  రిటైర్మెంట్ పై  గతంలో చిన్న తాల  సురేశ్ రైనా స్పందిస్తూ.. ధోని  ఈ సీజన్ రిటైర్ కాడని,  ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత  మరో ఏడాది ఆడి అప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానని  చెప్పినట్టు  వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఇక నిన్న చెపాక్ లో  కేకేఆర్ తో  జరిగిన లో స్కోరింగ్ గేమ్ లో ఫలితం చెన్నైకి అనుకూలంగా రాలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో  ఆరు వికెట్ల నష్టానికి  144 పరుగులు చేసింది. శివమ్ దూబే  (48)  ఒక్కడే సీఎస్కే తరఫున రాణించాడు.  అనంతరం లక్ష్యాన్ని  18.3 ఓవర్లలోనే  నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ సారథి  నితీశ్ రాణా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) లు  రాణించారు. 

click me!