దశాబ్దం కిందట ఏ యంగ్ ప్లేయర్ అయినా నిలకడగా రాణిస్తూ సెంచరీలు చేస్తుంటే... వెంటనే సచిన్ టెండూల్కర్‌తో పోలిక తెచ్చేవాళ్లు. మరో సచిన్‌లా అవుతాడా? అంటూ చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు ఏ యంగ్ ప్లేయర్ బాగా ఆడినా విరాట్ కోహ్లీతో పోలిక తెస్తున్నారు...
సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో బ్యాటుతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 7 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా ఉన్నాడు. 2021 సీజన్‌లో ఆర్‌సీబీలోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
27
‘కెరీర్ ఆరంభంలో నన్ను విరాట్ కోహ్లీతో పోల్చి చూశారు. నా కెరీర్‌లో నేను పొందిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. ఎందుకంటే నాలాంటి ప్లేయర్లు చాలా మంది వస్తారు, వెళ్తారు. అందరినీ విరాట్ కోహ్లీతో పోల్చాల్సిన అవసరం లేదు...
37
Image credit: PTI
నేను విరాట్ కోహ్లీలా ఆడలేను. కెరీర్ మొదట్లో రెండు మూడు ఇన్నింగ్స్‌ల్లో బాగా ఆడగానే మరో విరాట్ కోహ్లీ అంటూ కొన్ని హెడ్డింగ్స్ చూశాను. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ విషయం అందరూ మరిచిపోయారు..
47
Image credit: PTI
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్‌లతో కలిసి ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా. ఇండియాకి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రతీసారీ, ఈసారి ఓ కొత్త అనుభవం పొందబోతున్న ఫీలింగ్ వస్తుంది.
57
Glenn Maxwell
ఇక్కడి జనాలు మాపై చూపించే అభిమానం, ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు...’ అంటూ వ్యాఖ్యానించాడు ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్..
2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని 2021 వేలంలో 14.25 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ సీజన్‌లో 513 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2022 సీజన్‌లో రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది ఆర్‌సీబీ...
గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడి 301 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2023 సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో 384 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్ డుప్లిసిస్‌తో కలిసి ఈ సీజన్‌లో నాలుగు సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్..