ఆసియా కప్ 2023 టోర్నీని పాకిస్తాన్ నుంచి తప్పిస్తే, ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడబోమని హెచ్చరిస్తూ వస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఐసీసీ...
ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇండియా, పాకిస్తాన్‌లో అడుగుపెట్టేందుకు ససేమీరా అంటోంది. దీంతో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ టీమ్ ఆడదని పీసీబీ హెచ్చరిస్తూ వచ్చింది..
26
అయితే వన్డే వరల్డ్ కప్ ఆడకపోతే భారీ ఫైన్ కట్టాల్సి ఉంటుందని పీసీబీ హెచ్చరించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... 10 గ్లోబల్ టీమ్స్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ...
36
Image credit: Wikimedia Commons
ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఐసీసీ తరుపున బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.963 కోట్ల ట్యాక్స్‌లు చెల్లిస్తోంది. దీంతో ఐసీసీకి వన్డే వరల్డ్ కప్ కారణంగా వేల కోట్ల ఆదాయం రానుంది...
46
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ ప్రోటోకాల్ తయారుచేసిన ఐసీసీ, పీసీబీ నుంచి క్లారిటీ కోసం షెడ్యూల్‌ని ఇంకా ప్రకటించలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ ఆడకపోతే, మరో టీమ్‌ని నేరుగా సూపర్ లీగ్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది.
56
ఇదే జరిగితే వరల్డ్ కప్ షెడ్యూల్‌లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడకకూడదని నిర్ణయం తీసుకుంటే, 200 మిలియన్ల డాలర్లు (పాక్ కరెన్సీలో 5900 కోట్ల రూపాయలకు పైగా) చెల్లించాలని హెచ్చరికలు జారీ చేసింది ఐసీసీ..
66
India vs Pakistan
అసలే ఆర్థిక మాంద్యంతో చితికిపోయిన పాకిస్తాన్‌కి ఇంత భారీ ఫైన్ కట్టడం అయ్యే పని కాదు. దీంతో ఆసియా కప్ 2023 విషయంలో బీసీసీఐ పంతం నెగ్గినట్టే కనిపిస్తోంది..