కీలక మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు భారీ షాక్.. ఆ ఆల్ రౌండర్ ఆడేది అనుమానమే..?

Published : Apr 08, 2023, 02:31 PM IST

IPL 2023: ఐపీఎల్ - 16 లో  ఫస్ట్ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్  (ముంబై వర్సెస్ చెన్నై)   నేడు వాంఖడే వేదికగా జరుగనుంది.  ఈ  మ్యాచ్ కు ముందు సీఎస్కేకు భారీ షాక్ తప్పేలా లేదు. 

PREV
16
కీలక మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు భారీ షాక్.. ఆ ఆల్ రౌండర్ ఆడేది అనుమానమే..?

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ గా ఉన్న ముంబై ఇండియన్స్  - చెన్నై  సూపర్ కింగ్స్ ల మధ్య నేడు   ఈ సీజన్ లో ఫస్ట్ ఎల్ క్లాసికో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు ముందే చెన్నైకి భారీ షాక్ తప్పేలా లేదు.  ఆ జట్టు ఆల్ రౌండర్, గతేడాది వేలంలో రూ.  16.25 కోట్లు  వెచ్చించి కొనుగోలు చేసిన  బెన్ స్టోక్స్  ఈ మ్యాచ్ లో ఆడేది అనుమానంగానే ఉంది.  

26

ముంబైతో మ్యాచ్ కోసం ఇదివరకే వాంఖెడేకు చేరుకున్న  చెన్నై సూపర్ కింగ్స్.. గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా   స్టోక్స్ మడమకు గాయమైనట్టు తెలుస్తున్నది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన కథనం మేరకు..    ప్రాక్టీస్ చేస్తుండగా  స్టోక్స్  మడమ తీవ్రంగా వేధించింది. నొప్పితో విలవిల్లాడిన స్టోక్స్ ను      పరీక్షించిన చెన్నై సూపర్ కింగ్స్ వైద్య బృందం.. అతడికి కనీసం పది రోజుల విరామం కావాలని తెలిపింది. 

36

స్టోక్స్ ఇదివరకే మోకాలి గాయంతో  బాధపడుతున్నాడు.  అందుకే అతడు ఈ సీజన్ లో బౌలింగ్ కూడా చేయడం లేదు. గుజరాత్ తో మ్యాచ్ లో బౌలింగ్ కు దిగని  స్టోక్స్..  లక్నోతో మ్యాచ్ లో మాత్రం ఒక్క ఓవర్ వేసి  18 పరుగులివ్వడంతో ధోని మళ్లీ అతడికి బంతినివ్వడానికి సాహసించలేదు.  

46

ఇక తాజాగా స్టోక్స్ మడమ గాయంతో  బాధపడుతుండటంతో అతడిని ఆడించి  రిస్క్ చేయడం ఎందుకనే భావనలో  సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ ఉంది.  స్టోక్స్ ను ఆడిస్తే అతడిని కేవలం  బ్యాటింగ్ కే పరిమితం చేసి   ఇంపాక్ట్ ప్లేయర్ గా  బౌలర్ ను బరిలోకి దింపాలనే  ఆలోచన కూడా సీఎస్కే  మేనేజ్మెంట్ కు ఉన్నట్టు సమాచారం. 

56
Sisanda Magala

అలా చేస్తే   దక్షిణాఫ్రికా బౌలర్ సిసంద మగల  ముంబైతో మ్యాచ్ లో  ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతాడు.  ఒకవేళ  బెన్ స్టోక్స్  ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నా  మగలను బరిలోకి దింపొచ్చు.  
 

66
Image credit: Getty

ఒకవేళ వైద్యుల సూచన మేరకు బెన్ స్టోక్స్ ను పది రోజుల పాటు విరామం ఇవ్వాలని భావిస్తే మాత్రం అది చెన్నైకి  నష్టమే.   నేడు ముంబైతో  మ్యాచ్ తర్వాత చెన్నై.. ఈనెల 12న రాజస్తాన్ తో, 17న బెంగళూరుతో మ్యాచ్ ఆడనుంది.  ఈ రెండు మ్యాచ్ లకు  స్టోక్స్ దూరమయ్యే అవకాశాలుంటాయి.   

click me!

Recommended Stories