సెంచరీల మోత మోగుతోంది... కామెరూన్ గ్రీన్ సెంచరీతో 16 ఏళ్ల ఐపీఎల్‌ రికార్డు బ్రేక్...

Published : May 21, 2023, 09:41 PM IST

ఐపీఎల్‌ 2023 సీజన్‌ క్లైమాక్స్‌కి చేరుకుంది. మరో నాలుగు మ్యాచుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. లాస్ట్ ఓవర్ థ్రిలర్స్‌తో వన్ ఆఫ్ బెస్ట్ సీజన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటికే 9 సెంచరీలు నమోదు అయ్యాయి.   

PREV
19
సెంచరీల మోత మోగుతోంది... కామెరూన్ గ్రీన్ సెంచరీతో 16 ఏళ్ల ఐపీఎల్‌ రికార్డు బ్రేక్...
Image credit: PTI

ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ఇన్ని సెంచరీలు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2022 సీజన్‌లో 8 సెంచరీలు నమోదు అయ్యాయి. ఈ రికార్డు ఏడాదిలోనే బ్రేక్ అయ్యింది.. అంతకుముందు 2016లో 7 సెంచరీలు నమోదు అయ్యాయి..

29
shubman gill

రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ శతకాలు బాదారు..

39
Image credit: PTI (suryakumar yadav)

ముంబై ఇండియన్స్ తరుపున సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ సెంచరీలు చేశారు.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్, ఆర్‌సీబీ తరుపున విరాట్ కోహ్లీ సెంచరీ బాదారు. 

49
venkatesh iyer

కేకేఆర్ తరుపున 15 సీజన్ల తర్వాత సెంచరీ చేసిన బ్యాటర్‌గా వెంకటేశ్ అయ్యర్ రికార్డు క్రియేట్ చేశాడు. సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి ఏ బ్యాటర్ సెంచరీలు నమోదు చేయలేకపోయారు.. 
 

59
virat kohli (PTI Photo)(PTI05_18_2023_000334B)

యశస్వి జైస్వాల్, వెంకటేశ్ అయ్యర్, హెన్రీచ్ క్లాసిన్ సెంచరీలు చేసిన మ్యాచుల్లో ఓటమి ఎదురుకాగా మిగిలిన మ్యాచుల్లో సెంచరీలు, ఆయా టీమ్స్‌కి విజయాలను అందించాయి...

69
harry brook Image credit: PTI

సెంచరీలే కాదు 90+ స్కోర్లు ప్లేయర్ల సంఖ్య కూడా ఈసారి భారీగానే ఉంది. శిఖర్ ధావన్, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా కేకేఆర్‌పై యశస్వి జైస్వాల్ 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి సీజన్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని 2 పరుగుల తేడాతో మిస్ చేసుకున్నాడు.
 

79
prabhsimran singh

2023 సీజన్‌లో ఐదు సార్లు డకౌట్ అయిన ఆర్ఆర్ ఓపెనర్ జోస్ బట్లర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో 95 పరుగులు చేశాడు.

 

89
Yashasvi jaiswal

లియామ్ లివింగ్‌స్టోన్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై, లక్నోపై శుబ్‌మన్ గిల్ 94 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగులు చేశాడు. 

99
Heinrich Klaasen

ఈ సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున హారీ బ్రూక్, హెన్రీచ్ క్లాసిన్ సెంచరీలు చేశారు... 2023 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్‌లకు సెంచరీలు ఇచ్చారు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు.. 

click me!

Recommended Stories