అప్పుడు అలా, ఇప్పుడు ఇలా! టీమిండియా నుంచి పిలుపు రాగానే రిలాక్స్ అయిపోయిన అజింకా రహానే...

Published : May 11, 2023, 12:29 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు అజింకా రహానే. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రహానే, ఆ గేమ్ తర్వాత సీఎస్‌కేకి కీ ప్లేయర్ అయిపోయాడు..

PREV
16
అప్పుడు అలా, ఇప్పుడు ఇలా! టీమిండియా నుంచి పిలుపు రాగానే రిలాక్స్ అయిపోయిన అజింకా రహానే...
Ajinkya Rahane

మొయిన్ ఆలీ గాయం కారణంగా తుది జట్టులోకి వచ్చిన అజింకా రహానే, మొదటి 5 మ్యాచుల్లో 199.04 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడి అజింకా రహానే వెర్షన్ 2.0గా కనిపించాడు...

26

అజింకా రహానే సెన్సేషనల్ ఫామ్‌తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు దక్కింది. దాదాపు 17 నెలల తర్వాత టీమిండియా తరుపున ఆడబోతున్నాడు అజింకా రహానే...

36
Ajinkya Rahane

అయితే సెలక్టర్ల నుంచి పిలుపు రాగానే అజింకా రహానే ఆటతీరు పూర్తిగా మారిపోయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి జట్టును ప్రకటించక ముందు 199.05 స్ట్రైయిక్ రేటుతో 52.25 సగటుతో పరుగులు చేసిన అజింకా రహానే... ఆ తర్వాత 3 మ్యాచుల్లో 19 యావరేజ్‌తో 114 స్ట్రైయిక్ రేటుతో మాత్రమే పరుగులు చేశాడు...

46
PTI Photo) (PTI04_27_2023_000372B)

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక కావడంతో అజింకా రహానే రిలాక్స్ అయిపోయాడని సీఎస్‌కే ఫ్యాన్స్ వాపోతున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్ వాదన మాత్రం మరోలా ఉంది...

56

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అందుబాటులో ఉండేందుకు వీలుగా అజింకా రహానే రిస్క తీసుకోకుండా ఆడుతున్నాడని, ఫిట్‌గా టీమ్‌కి అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వాదిస్తున్నారు మరికొందరు..
 

66
Ajinkya Rahane

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన అజింకా రహానే, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ప్రాక్టీస్ మొదలెట్టేశాడని అంటున్నారు అతని అభిమానులు..

click me!

Recommended Stories