మా వాళ్లే నేను అవుట్ అవ్వాలని కోరుకుంటున్నారు! ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు... - రవీంద్ర జడేజా

First Published May 11, 2023, 11:54 AM IST

సచిన్ టెండూల్కర్ ఆడే రోజుల్లో బాగా ఆడుతున్నా సరే రాహుల్ ద్రావిడ్ త్వరగా అవుట్ అవ్వాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకునేవారట. ద్రావిడ్ అవుట్ అయితే టెండూల్కర్ క్రీజులోకి వస్తాడని వారి ఆశ. స్వయంగా ద్రావిడ్ ఈ విషయంలో గోడు వెల్లబోసుకున్నాడు. ఇప్పుడు జడ్డూదీ అదే పరిస్థితి..

ఐపీఎల్ 2023 సీజన్‌లో బ్యాటుతో మెరుపులు మెరిపించకపోయినా బంతితో అదరగొడుతున్నాడు రవీంద్ర జడేజా. 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, బ్యాటింగ్‌లో 18.83 సగటుతో 113 పరుగులు చేశాడు...

PTI PhotoR Senthil Kumar)(PTI04_30_2023_000246B)

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 16 బంతుల్లో 21 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. జడేజా పర్ఫామెన్స్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది..

Latest Videos


jadeja

ఐపీఎల్ 2023 సీజన్‌లో జడ్డూకి ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఇంతకుముందు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచుల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు జడ్డూ..

PTI PhotoR Senthil Kumar)(PTI05_06_2023_000205B)

చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 13 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన జడేజా, ధోనీ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధోనీ 15 సార్లు ఈ ఫీట్ సాధిస్తే, 12 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన సురేష్ రైనాని రవీంద్ర జడేజా అధిగమించాడు..

‘స్పిన్నర్‌గా పిచ్‌లో టర్న్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడే మేం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి లైన్ అండ్ లెంగ్త్ ఎలా ఉండాలో మాకు ఓ ఐడియా ఉంటుంది. వేరే టీమ్స్‌కి ఆ విషయం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది...

Image credit: PTI

ప్రతీ ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం జోడిస్తున్నారు. నిజానికి నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. నేను ఎప్పుడు క్రీజులోకి వచ్చిన ధోనీ... ధోనీ.. అరుపులే వినిపిస్తున్నాయి...

PTI PhotoR Senthil Kumar) (PTI04_21_2023_000312B)

బ్యాటింగ్ ఆర్డర్‌లో పైన వస్తే నేను అవుట్ కావాలని మా ఫ్యాన్సే కోరుకుంటున్నారు. అలాగని 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చినా అంతే తంతు. నేనెప్పుడూ అవుట్ అవుతానా, ధోనీ ఎప్పుడు వస్తాడా? అని ఎదురుచూస్తున్నారు...  విజయాలు వస్తున్నంతకాలం నేను హ్యాపీయే...’ అంటూ కామెంట్ చేశాడు రవీంద్ర జడేజా.. 

click me!