ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో పేలవ ఫామ్‌తో సతమతమైన సూర్యకుమార్ యాదవ్, ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. 11 మ్యాచల్లో 376 పరుగులు చేసిన సూర్య, ముంబై ఇండియన్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి..
26
సూర్య సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే ఊది పడేసింది ముంబై ఇండియన్స్. ఈ విజయంతో ఏకంగా టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై ఇండియన్స్...
36
Image credit: PTI
‘సూర్యకుమార్ యాదవ్, బౌలర్లతో ఓ ఆటాడుకుంటున్నాడు. అతను గల్లీ క్రికెట్ ఆడినట్టు, షాట్స్ ఆడుతున్నాడు. సూర్య ఆట వెనక ఎంతో కఠినమైన శ్రమ, ప్రాక్టీస్ ఉన్నాయి...
46
Image credit: PTI
అతని బాటమ్ హ్యాండ్ గేమ్ చాలా పవర్‌ఫుల్. సూర్య ఎంతో పర్ఫెక్ట్‌గా లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ సైడ్ షాట్స్ ఆడుతున్నాడు. ఆ తర్వాత వ్యవసాయం చేసినట్టు గ్రౌండ్‌కి అన్ని వైపులా విత్తనాలు జల్లినట్టు, బౌండరీలు బాదుతున్నాడు..
56
Image credit: PTI
సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆడితే ఏ ప్లేయర్‌కైనా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నేహాల్ వదేరా ఇన్నింగ్స్ చాలా ముచ్చటగా అనిపించింది. అతను సూర్యని చూసి షాట్స్ కొట్టాలని అనుకోలేదు..
66
తన బలం ఏంటో, బలహీనత ఎంతో పక్కగా తెలిసినట్టు ఆడాడు. అతను ఫ్యూచర్‌లో మంచి ప్లేయ్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...