IPL: అప్పట్లోగా పేర్లు రిజిష్టర్ చేసుకోండి.. ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు బీసీసీఐ డెడ్‌లైన్..?

First Published Nov 23, 2022, 4:18 PM IST

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఎడిషన్ కోసం బీసీసీఐ  ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది. వచ్చే నెలలో వేలం  జరగాల్సి ఉంది. ఈ మేరకు బీసీసీఐ ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు  జారీ చేసింది. 
 

ఐపీఎల్ - 2023 కోసం బీసీసీఐ వచ్చే నెలలో మినీ వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు ఈనెల 15న రిటెన్షన్ ప్రక్రియను  పూర్తి చేసింది. రిటెన్షన్ లో పది ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుని కొంతమందిని విడుదల చేశాయి.  

ఇక ఇప్పుడు  అందరి దృష్టీ వేలం మీదే ఉంది.  డిసెంబర్ 23న వేలం  ప్రక్రియ జరగాల్సి ఉంది. కొచ్చి (కేరళ) వేదికగా ఈసారి వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది.  అయితే వేలానికంటే ముందు  బీసీసీఐ ఫ్రాంచైజీలతో పాటు ఆటగాళ్లకు  కీలక సూచనలు చేసింది. 


డిసెంబర్ 23 వేలంలో ఉండాలంటే  వచ్చే నెల 15 వరకూ అన్ని ఫ్రాంచైజీలు,  వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లు ముందుగా రిజిష్టర్ చేసుకోవాలని   సూచించింది.  రిజిస్ట్రేషన్ అయిన ఆటగాళ్లే వేలంలో  పాల్గొంటారు.  
 

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘వేలంలో పాల్గొనబోయే  ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి  డెడ్ లైన్ ను డిసెంబర్ 15గా నిర్ణయించాం.  డిసెంబర్ 23ను వేలం తేదీగా నిర్ణయించినా  పలు ఫ్రాంచైజీలు మాత్రం ఇంకాస్త ముందుగానే  పెట్టాలని విన్నవించాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వేలం తేదీని ముందుకు జరిపితే బాగుంటుందని పలు ఫ్రాంచైజీలు మమ్మల్ని అడిగాయి. అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం..’అని  తెలిపాడు. 

ఇక వేలం విషయానికొస్తే గతేడాది ఐపీఎల్ లో కనిపించని ఇంగ్లాండ్  ఆల్ రౌండర్  బెన్ స్టోక్స్, సామ్ కరన్ తో పాటు ఆస్ట్రేలియా యువ సంచలనం కామెరూన్ గ్రీన్  ల మీదే అందరి దృష్టి ఉంది.వీరితో పాటు ప్రపంచకప్ లో రాణించిన మరికొందరు  ఆటగాళ్లు, దేశవాళీలో అదరగొడుతున్న  క్రికెటర్ల మీదే అందరి చూపులున్నాయి. 

వేలంలో ఖర్చు చేసేందుకు గాను  సన్ రైజర్స్ వద్ద రూ. 42.50 కోట్లు, పంజాబ్ వద్ద రూ. 32.20 కోట్లు, లక్నో రూ. 23.35 కోట్లు, ముంబై రూ. 20.55 కోట్లు, చెన్నై రూ. 20.45 కోట్లు, ఢిల్లీ రూ. 19.45 కోట్లు, గుజరాత్ రూ. 19.25 కోట్లు, రాజస్తాన్ రూ. 13.20 కోట్లు, ఆర్సీబీ రూ. 8.75 కోట్లు, కోల్కతా రూ. 7.05 కోట్లు ఉన్నాయి. 

click me!