ఐపీఎల్ దెబ్బతో కళ్లు తెరిచిన బీసీసీఐ... ఉప్పల్ స్టేడియంతో పాటు వన్డే వరల్డ్ కప్ కోసం...

Published : Apr 11, 2023, 08:25 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా మొదలైంది. మూడేళ్ల తర్వాత దేశంలోని 12 ముఖ్య నగరాల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం మినహా మిగిలిన వేదికల్లో మ్యాచులను వీక్షిస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కారణం అరకోర వసతులే...

PREV
17
ఐపీఎల్ దెబ్బతో కళ్లు తెరిచిన బీసీసీఐ... ఉప్పల్ స్టేడియంతో పాటు వన్డే వరల్డ్ కప్ కోసం...

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌, సాంకేతిక కారణాలతో అరగంటకు పైగా ఆగిపోయింది. ఫ్లడ్ లైట్స్ వెలగడానికి మొండి చేయడంతో అరగంటకు పైగా ఆటకు అంతరాయం కలిగి, చివరకు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేల్చాల్సి వచ్చింది..
 

27
(PTI Photo/Vijay Verma) (PTI04_07_2023_000252B)

స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు విరిగిన సీట్లు స్వాగతం పలుకుతున్నాయి. చాలా స్టేడియాల్లో సీట్లపై పెయింట్ కంటే ఎక్కువగా పిట్టల రెట్టలు పడి ఉండడంతో కూర్చొని మ్యాచ్ చూసే వారి కంటే నిలబడి మ్యాచులు చూస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.. పైకప్పు నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో వర్షం వస్తే తడుస్తూ, ఎండకు ఎండుతూ మ్యాచులు చూస్తున్నారు అభిమానులు.. 

37
Image credit: PTI

వీటితో పాటు స్టేడియంలో మ్యాచులు చూసేందుకు వచ్చే వారి కోసం టాయిలెట్స్ సౌకర్యం కల్పించలేకపోతున్నాయి ఆయా రాష్ట్ర క్రికెట్ బోర్డులు. ఇలాంటి అరకోర సౌకర్యాలతో భారత క్రికెట్ ఫ్యాన్స్ సర్దుకుపోతారు. కానీ ఇదే ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది భారత్...

47

వన్డే వరల్డ్ కప్‌ 2023 మ్యాచులు చూసేందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌, శ్రీలంక, పాకిస్తాన్ వంటి విదేశాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు వస్తారు. ఆ సమయంలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఇలాగే అసౌకర్యానికి గురైతే క్రికెట్ ప్రపంచం ముందు టీమిండియా పరువు పోతుంది..

57
RCB Fans

దీంతో వన్డే వరల్డ్ కప్‌కి ముందే ఐదు ముఖ్య నగరాల్లోని స్టేడియాల్లో మెరుగైన వసతుల కల్పన కోసం నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో వాడుకలోని లేని స్టాండ్స్‌ పునరుద్ధరణ, మెరుగైన వసతుల కల్పన కోసం రూ.100 కోట్లు విడుదల చేసింది బీసీసీఐ..

67
RCB Women's

అలాగే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మరమ్మత్తుల కోసం రూ.117.17 కోట్లు విడుదల చేసిన బీసీసీఐ, కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరమ్మత్తుల కోసం అత్యధికంగా రూ.127.47 కోట్లు ఖర్చు చేయబోతోంది...

77
Mumbai Wankhade Stadium

అలాగే ఐపీఎల్‌ మ్యాచ్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన మొహాలీ స్టేడియంలో రూ.79.46 కోట్ల మరమ్మత్తులు చేయనున్న బీసీసీఐ, ముంబైలోని వాంఖడే స్టేడియంలో రిపేర్లకు 78.82 కోట్లు ఖర్చు చేయనుంది.. 

click me!

Recommended Stories