తమిళ ప్లేయర్లు లేకుండా చెన్నై టీమ్ ఏంటి? బ్యాన్ చేసేయండి... తమిళనాడు అసెంబ్లీలో జోరుగా చర్చ...

First Published Apr 11, 2023, 7:20 PM IST

భాషాభిమానం విషయంలో తెలుగువాళ్లు ఆఖరున ఉంటే, తమిళవాళ్లు ముందు వరుసలో ఉంటారు. వాళ్ల భాషకి వాళ్లు ఇచ్చే గౌరవం అలాంటిది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని వెంటనే బ్యాన్ చేయాలని తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరగడం హాట్ టాపిక్ అయ్యింది...
 

Image credit: PTI

హైదరాబాద్ టీమ్‌లో తెలుగువాళ్లు లేరు, ఉండరు. నిజానికి పేరుకి సన్‌రైజర్స్ హైదరాబాద్ అయినా దాని యజమానులు తమిళులే...  సన్‌ టీవీ నెట్‌వర్క్, అక్కడి నుంచి హైదరాబాద్ టీమ్‌ని నడిపిస్తోంది. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌లోనూ తమిళ ప్లేయర్లు లేరు...
 

Image credit: PTI

ఇంతకుముందు రవిచంద్రన్ అశ్విన్, మురళీ విజయ్ వంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్లేయర్ల, చెన్నై సూపర్ కింగ్స్‌లో సభ్యులుగా ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఉంటే మురళీ విజయ్ అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరి రిటైర్మెంట్ ఇచ్చేశాడు..

Latest Videos


Image credit: PTI

ఒక్క తమిళనాడు ప్లేయర్ కూడా లేకుండా తమిళనాడు టీమ్‌గా చెప్పుకుంటూ, చెన్నై పేరు వాడుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడ్డాడు పీఎంకే పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వరన్. ‘తమిళనాడులో చాలామంది యువత, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాలని ఆశపడుతున్నారు...

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో తమిళనాడు ప్లేయర్లకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఒక్క తమిళ ప్లేయర్ కూడా లేని చెన్నై సూపర్ కింగ్స్‌ని వెంటనే బ్యాన్ చేయాలి. తమిళనాడులో ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్లు దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నారు కూడా...

Image credit: PTI

తమిళనాడు ఐపీఎల్ టీమ్ సీఎస్‌కేకి చాలా క్రేజ్ ఉంది, ఆ క్రేజ్‌ని వాడి వాళ్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ తమిళ ప్లేయర్లకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. తమిళనాడు ప్రభుత్వం వెంటనే సీఎస్‌కే టీమ్‌ని బ్యాన్ చేయాలి.. ’ అంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపాదించాడు ధర్మపురి ఎమ్మెల్యే వెంకటేశ్వరన్.

అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ ప్రతిపాదనను పట్టించుకోలేదు. ఇప్పటికే స్పాట్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్లు నిషేధానికి గురైంది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే మరోసారి వేటుపడుతుందేమోనని భయపడుతున్నారు అభిమానులు.. 

click me!