ధోనీలాంటోడు ఇంతకుముందు లేడు, ఇకపైన రాడు... సీఎస్‌కే కెప్టెన్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్...

First Published Apr 17, 2023, 2:40 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్‌కి ఫుల్ స్టాప్ పడనుంది. 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ, ఈ సీజన్‌తో దానికి కూడా స్వస్తి పలకబోతున్నాడు...

Image credit: PTI

ఏ ముహుర్తాన టీమిండియాలోకి వచ్చాడో కానీ మహేంద్ర సింగ్ ధోనీ, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తిరుగులేని విజయాలు అందుకున్నాడు. 3 ఐసీసీ టైటిల్స్, 4 ఐపీఎల్ టైటిల్స్ సాధించిన ధోనీ ట్రాక్ రికార్డు ఇంకెవ్వరకీ సాధ్యం కాలేదు... ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ కెప్టెన్, క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...
 

Image credit: PTI

‘క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో చెన్నై సూపర్ కింగ్స్‌కి బాగా తెలుసు. అయితే ధోనీ కెప్టెన్‌గా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. 200 మ్యాచులకు కెప్టెన్సీ చేయడమంటే మామూలు విషయం కాదు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణించడం చాలా భారమైన విషయం...

Latest Videos


PTI PhotoR Senthil Kumar)(PTI04_02_2023_000246B)

అయితే ధోనీ ఎప్పుడూ కెప్టెన్సీని భారంగా భావించలేదు. ఎందుకంటే మాహీ చాలా ప్రత్యేకమైన రకం. ధోనీ చాలా భిన్నమైన వాడు. ఇంతకుముందు ధోనీలాంటోడు రాలేదు, ఇకపైన కూడా రాడు. అదే మాహీ స్పెషాలిటీ. ఫ్యూచర్‌లో ఎవ్వరైనా ఐపీఎల్ టైటిల్స్ గెలవచ్చు కానీ ధోనీ రేంజ్‌ని అందుకోలేరు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్.. 

Image credit: PTI

‘కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు. మిగిలిన విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆర్‌సీబీ విజయాల్లో అతనికి పూర్తి క్రెడిట్ దక్కాల్సిందే.. కోహ్లీ ఫామ్‌లో ఉండడం ఆర్‌సీబీకి కలిసి వచ్చే విషయం...

PTI PhotoRavi Choudhary)(PTI04_11_2023_000371B)

ముంబై ఇండియన్స్ కూడా గెలుపు బాటలోకి వచ్చేసింది. ఏ కాంబినేషన్లు వర్కవుట్ అవుతాయో వాళ్లు తెలుసుకున్నారు. టాప్ బౌలర్లు లేకపోయినా ముంబై పోటీలో నిలవడం చాలా గొప్ప విషయం.. అయితే ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ రేంజ్ సరిపోదు...

Sanju Samson and Shimron Hetmyer

రాజస్థాన్ రాయల్స్‌ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వాళ్లు గత సీజన్‌లో ఫైనల్‌ ఆడరనే విషయం మరిచిపోకూడదు. కెప్టెన్‌గా సంజూ శాంసన్ కూడా ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. బౌలింగ్ మార్పుల, ఫీల్డింగ్ సెట్టింగ్స్ విషయంలో కూడా ఎంతో పరిణితి చూపిస్తున్నాడు.. సంజూకి ధోనీలాగే తన సత్తాపై పూర్తి నమ్మకం ఉంది’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్... 

click me!