గుజరాత్‌తో ఫస్ట్ మ్యాచ్.. ‘టోర్నమెంట్ ఓపెనర్’లో చెన్నై ఎలా ఆడింది..?

First Published Mar 30, 2023, 2:32 PM IST

IPL 2023: ఐపీఎల్-16లో భాగంగా   శుక్రవారం  చెన్నై సూపర్ కింగ్స్.. డిఫెండింగ్ ఛాంపియన్  గుజరాత్ జెయింట్స్ తో తలపడనుంది.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 సీజన్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్ తో  చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో  ఢీకొనబోతుంది. ఐపీఎల్ లో నాలుగు సార్లు విజేతగా నిలిచిన  చెన్నై ఏకంగా 9 సార్లు ఫైనల్స్ ఆడింది.  ఈ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న  చెన్నై..  టోర్నమెంట్ ఓపెనర్ (సీజన్ లో ఆడే తొలి మ్యాచ్) లలో ఎలా ఆడింది..? 

2009లో చెన్నై టోర్నమెంట్ ఓపెనర్  మ్యాచ్ లో ముంబైతో తలపడింది.   ఈ మ్యాచ్ లో  చెన్నై 19 పరుగుల తేడాతో ఓడింది.  2011లో కూడా సీఎస్కే.. ముంబైతో మొదటి మ్యాచ్ లో  ఆడింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో  సీఎస్కే.. రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 

Latest Videos


2012లో  కూడా ముంబై - చెన్నైల మధ్యే తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోని సేన ముంబై చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.  2018లో  ధోని అండ్ కో.. ముంబై పై ఒక్క వికెట్ తేడాతో  గెలిచింది. 

2019లో తొలి మ్యాచ్ లో  చెన్నై, ఆర్సీబీ తలపడ్డాయి.  ఈ పోరులో సీఎస్కే ..ఆర్సీబీకి షాకిచ్చింది.  బెంగళూరుపై చెన్నై ఏడు వికెట్ల తేడాతో  నెగ్గింది. 

2020లో  సీఎస్కే  - ముంబై ల మధ్య  తొలి పోరు జరిగింది.  ఈ  మ్యాచ్ లో  సీఎస్కే.. ముంబైని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.   కానీ ఈ సీజన్ లో  ముంబై విజేతగా నిలవడం గమనార్హం. 

2022లో  ధోని సేన  తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్.. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 
 

మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏడు సార్లు టోర్నమెంట్ ఓపెనర్లు ఆడిన చెన్నై..  నాలుగు మ్యాచ్ లలో గెలిచి మూడింట్లో ఓడింది. మరి  రేపు గుజరాత్ తో పోరులో  ధోని గ్యాంగ్ ఏం చేస్తుందో చూడాలి. 

click me!