IPL 2023: ఐపీఎల్‌లో ఈ రికార్డులు ధోనికే సొంతం.. దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు..

First Published Mar 29, 2023, 6:58 PM IST

IPL 2023: మరో 48 గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16  సీజన్ కు సర్వం సిద్ధమైంది. ఈ  సీజన్  భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్కే సారథి ఎంఎస్ ధోనికి చివరి సీజన్ అని భావిస్తున్నారు. 

మహేంద్ర సింగ్ ధోని.. ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. భారత్ కు మూడు  ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోని.. ఐపీఎల్ లో చెన్నై  సూపర్ కింగ్స్ ను నాలుగుసార్లు విజేతగా నిలిపాడు. ఐపీఎల్ లో ధోని  లెక్కకు మిక్కిలి రికార్డులు  తన పేరిట లిఖించుకున్నాడు. ఇందులో అరుదైన  కొన్ని ఘనతలను ఇక్కడ చూద్దాం.. 

చెన్నై  సూపర్ కింగ్స్ కు ఉన్న కోచింగ్ సిబ్బందితో ఆడి, వారికి  కెప్టెన్ గా వ్యవహరించి ఆ తర్వాత  కూడా వాళ్లతో ఆడుతున్న ఒకే ఒక్క  ఆటగాడు ధోని.   ప్రస్తుతం చెన్నై కోచింగ్ స్టాప్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైఖెల్ హస్సీ, లక్ష్మీపతి బాలాజీలు ఒకప్పుడు ధోని సారథ్యంలో ఆడినవారే. 

Latest Videos


ధోని అంటేనే ఫినిషర్. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే ధోని..  ఇన్నింగ్స్ చివర్లో వచ్చి దుమ్ము రేపుతాడు.   అలా  చివర్లో వచ్చి  20 వ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ధోని. ఇప్పటివరకూ 20 వ ఓవర్లో వచ్చి ధోని చేసిన పరుగులు 564.  మరే బ్యాటర్ ఇన్ని పరుగులు చేయలేదు. 

కెప్టెన్ గా వంద మ్యాచ్ లను గెలిచిన  సారథి మహేంద్రుడే.   ఐపీఎల్ లో ధోని సారథిగా  ఏకంగా 104 మ్యాచ్ లు గెలిచాడు. ధోని  మొత్తంగా ఐపీఎల్  లో  234 (ఇందులో సీఎస్కేకు 196) మ్యాచ్ లు ఆడాడు.   206 ఇన్నింగ్స్ లలో 4,978 పరుగులు సాధించాడు.   ఈ క్రమంలో ధోని సగటు  39.20 గా ఉండగా  స్ట్రైక్ రేట్  135.20గా ఉంది.  ఐపీఎల్ లో ఎక్కువగా ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని..   తాను ఆడిన ప్రతీ  పొజిషన్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇలా సాధించిన ఒకే ఒక్క ఆటగాడు ధోని. 

ఐపీఎల్ ఫైనల్స్ లో అత్యధిక సార్లు ఆడిన ఆటగాడు, కెప్టెన్ గా ధోని  అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకూ ధోని   10 ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడు. ఇందులో  నాలుగు సార్లు ట్రోఫీ కూడా గెలిచాడు.  

వికెట్ కీపర్  గా ధోని రికార్డులను అందుకోవడం రాబోయే తరాలకు కూడా సాధ్యం కాదు.  ఐపీఎల్ లో  ధోని..  190 మ్యాచ్ లకు వికెట్ కీపర్ గా ఉండి 132  డిస్మిసల్స్ లో పాలు పంచుకున్నాడు.  39 స్టంపింగ్స్ కూడా చేశాడు. ఇది కూడా ఓ రికార్డే. 

click me!