ఎన్‌సీఏకి చేరిన రిషబ్ పంత్... వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత రీఎంట్రీ! అయితే అది కష్టమే...

Published : Apr 26, 2023, 06:24 PM IST

2022 డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, నాలుగు నెలల తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకున్న రిషబ్ పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్‌కి వచ్చాడు...

PREV
16
ఎన్‌సీఏకి చేరిన రిషబ్ పంత్... వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత రీఎంట్రీ! అయితే అది కష్టమే...

బెంగళూరులో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైయినింగ్ క్యాంప్‌ని సందర్శించిన రిషబ్ పంత్, అక్కడే ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియచేశాడు రిషబ్ పంత్. అయితే రిషబ్ పంత్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని వైద్యులు నిర్ధారించారు...
 

26

ప్రస్తుతం కర్ర సాయంతో నడుస్తున్న రిషబ్ పంత్, ఎవరి సాయం లేకుండా నడిచేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని బీసీసీఐ ఫిజియో, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ హెడ్ డాక్టర్ దిన్షా పర్దివాలా తెలియచేశారు...

36

రిషబ్ పంత్ మోకాలికి ఇప్పటికీ శస్త్ర చికిత్స ముగిసింది. అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరో సర్జరీ అవసరం అవుతుందని వైద్యులు భావిస్తున్నారు. మరో రెండు మూడు వారాల్లో ఈ శస్త్ర చికిత్స నిర్వహించబోతున్నారు...

46
Rishabh Pant

సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌తో పాటు అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు రిషబ్ పంత్ దూరం కాబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌లో కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ రిషబ్ పంత్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

56
Rishabh Pant

రిషబ్ పంత్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినా వికెట్ కీపింగ్ చేసేందుకు చాలా సమయం పట్టనుంది. మోకాళ్ల శస్త్ర చికిత్స కారణంగా అతను కొన్ని నెలల పాటు వికెట్ కీపింగ్‌కి దూరంగా ఉండబోతున్నాడు. డిసెంబర్- జనవరి 2024 సీజన్‌లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినా కేవలం బ్యాటర్‌గానే కొనసాగబోతున్నాడు...

66
Image credit: Getty

ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన తర్వాత లేదా 2024 టీ20 వరల్డ్ కప్ సమయానికి రిషబ్ పంత్, వికెట్ కీపర్‌గానూ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రిషబ్ పంత్ గైర్హజరీతో వన్డే టీమ్‌కి కెఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తుంటే టెస్టుల్లో శ్రీకర్ భరత్ ఆ బాధ్యతలు మోస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories