చాలామంది నీలాగే అలా వచ్చి ఇలా వెళ్లారు! జాగ్రత్త... రింకూ సింగ్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్...

Published : Apr 24, 2023, 05:34 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు రింకూ సింగ్. గత ఏడాది కేకేఆర్ తరుపున రెండు మూడు ఇన్నింగ్స్‌ల్లో అదరగొట్టిన రింకూ సింగ్, ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు...  

PREV
16
చాలామంది నీలాగే అలా వచ్చి ఇలా వెళ్లారు! జాగ్రత్త... రింకూ సింగ్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్...
Image credit: PTI

ఈ సునామీ ఇన్నింగ్స్ తర్వాత కూడా రింకూ సింగ్ బ్యాటు నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వచ్చాయి. ఇప్పటిదాకా 7 మ్యాచుల్లో 58.25 సగటుతో 233 పరుగులు చేశాడు రింకూ సింగ్. మనోడి స్ట్రైయిక్ రేటు 157.43గా ఉంది...

26
PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000300B)

‘రింకూ సింగ్‌పైన ఇప్పుడు చాలా కళ్లు పడ్డాయి. అతను ఓ సంచలన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ప్రతీ మ్యాచ్‌లోనూ అలాంటి ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటారు అభిమానులు. ఇప్పుడు వచ్చిన ఈ క్రేజ్‌ని రింకూ, అతని ఫ్యామిలీ ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా ముఖ్యం...

36

అయితే ఒక్కరోజులో వచ్చిన సక్సెస్‌ని తలకెక్కించుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవాలి కానీ దాన్ని తలుచుకుని మురిసిపోకూడదు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఇలా ఎందరో కుర్రాళ్లు ఓవర్‌నైట్ స్టార్లు అయ్యారు, కానీ ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయారు...
 

46
PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000334B)

ఇప్పుడు రింకూ సింగ్ ఏదైనా చేయగలడని అభిమానులు నమ్ముతున్నారు. అయితే బెటర్ ప్లేయర్‌గా ఉండడం వేరు, బెటర్ మనిషిగా బతకడం వేరు. అలా మారాలంటే అతనికి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. చాలామంది ఇది లేకనే, సక్సెస్‌ని కొనసాగించలేకపోయారు...

56
PTI Photo)(PTI04_09_2023_000322B)

రింకూ సింగ్ కంటే ముందు యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. అది కూడా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో... అయితే టీమ్ విజయానికి ఆఖరి 5 బంతుల్లో 29 పరుగులు కావాల్సిన సమయంలో ఇలాంటి ఫీట్ సాధించడం చాలా అరుదైన విషయం.

66
Image credit: PTI

అయితే ఈ సక్సెస్‌ని సుదీర్ఘ కాలం కొనసాగించడం చాలా చాలా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్.. 

click me!

Recommended Stories