ఐపీఎల్‌లో అరుదైన దృశ్యం... బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ ముగ్గురూ వాళ్లే! రెహ్మానుల్లా గుర్భాజ్ ఇచ్చిన...

Published : Apr 29, 2023, 06:44 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత బౌలర్ బౌలింగ్‌లో భారత బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ని భారత ఫీల్డర్ అందుకోవడం పెద్ద గొప్పేమీ కాదు...

PREV
15
ఐపీఎల్‌లో అరుదైన దృశ్యం... బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ ముగ్గురూ వాళ్లే! రెహ్మానుల్లా గుర్భాజ్ ఇచ్చిన...
GURBAZ CATCH

ప్రతీ మ్యాచ్‌లో కనీసం 14 మంది భారత ప్లేయర్లు బరిలో దిగుతుండడంతో ఇది చాలా సాధారణ విషయం. అయితే వేరే దేశానికి చెందిన బ్యాటర్, అదే దేశానికి చెందిన బౌలర్ బౌలింగ్‌లో తమ దేశానికే చెందిన ప్లేయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం చాలా అరుదైన విషయమే... 

25
Noor Ahmad

ఐపీఎల్‌లో ఈ అరుదైన ఫీట్‌ని నమోదు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘాన్ ప్లేయర్ రెహ్మానుల్లా గుర్భాజ్, ఆఫ్ఘాన్ స్పిన్ బౌలర్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ ముగ్గురూ కూడా ఆఫ్ఘానీలే.. 
 

35
Rahmanullah Gurbaz

అంతకుముందు ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ బాదిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ క్రికెటర్‌గా నిలిచిన రెహ్మానుల్లా గుర్భాజ్, 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేసి... రెండో హాఫ్ సెంచరీ బాదాడు.. 

45
Image credit: PTI

ఇంతకుముందు మహ్మద్ నబీ, ముజీబ్ వుర్ రహ్మాన్, రషీద్ ఖాన్ వంటి ఆఫ్ఘాన్ ప్లేయర్లు... ఐపీఎల్‌లో 50 ప్లస్ స్కోరు నమోదు చేయలేకపోయారు. గత ఏడాది కేకేఆర్‌లో ఉన్న రెహ్మనుల్లా గుర్భాజ్, ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 
 

55
(PTI Photo) (PTI04_25_2023_000381B)

2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేయర్‌గా పంజాబ్ కింగ్స్‌పై 55 పరుగులు సమర్పించిన రషీద్ ఖాన్, నేటి మ్యాచ్‌లో వికెట్ తీయకుండా 54 పరుగులు సమర్పించి, ఐపీఎల్‌లో రెండో అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు...

click me!

Recommended Stories