వంట చేస్తానని చెప్పి, ఆస్ట్రేలియాలో ఫైన్ కట్టిన సంజూ శాంసన్... యజ్వేంద్ర చాహాల్ చెప్పేదాకా..

First Published May 16, 2022, 5:43 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా ఇంప్రెస్ చేస్తున్న భారత యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా వంటి యంగ్ కెప్టెన్ల మధ్యలో రాజస్థాన్ రాయల్స్  

Sanju Samson

2015లో 19 ఏళ్ల వయసులో టీమిండియాకి సెలక్ట్ అయిన సంజూ శాంసన్, ఆ తర్వాత ఐదేళ్ల పాటు జట్టుకి దూరమయ్యాడు. తాజాగా సంజూ శాంసన్, జట్టులోకి వచ్చిన కొత్తలో జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు యజ్వేంద్ర చాహాల్..

‘2016లో మేం ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లాం. నేను, సంజూ శాంసన్ కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో తిరుగుతున్నాం. సంజూ శాంసన్ ఓ ఫ్రైయింగ్ పాన్ తీసుకున్నాడు...

Image Credit: Sanju Samson Instagram

ఆకలిగా ఉందని పాన్‌ని ఎలక్ట్రిక్ స్టవ్ మీద పెట్టి గుడ్డు ఫ్రై చేయడం మొదలెట్టాడు. కొద్దిసేపటికే ఆ గదిలో ఉన్న ఫైర్ అల్లారం మోగింది. ఏం జరుగుతుందో అర్థం కాక, అందరూ కంగారుపడ్డారు...

Sanju Samson

అగ్నిమాపక సిబ్బంది వచ్చి, ఏం జరిగిందని అడిగారు. మాకు ఫైర్ అల్లారం ఎలా మోగిందో కూడా తెలీదని చెప్పా. చూస్తే సంజూ... ఫ్రైయింగ్ పాన్ కింద ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తీయడం మరిచిపోయాడు...

అది అంటుకుని పొగతో అల్లారం మోగింది. జరిగింది తెలుసుకుని మేమంతా పడి పడి నవ్వాం. అందరూ కంగారుపెట్టినందుకు సంజూ, ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది... సంజూ కూడా ఇలా ఎలా జరిగిందంటూ పడి పడి నవ్వాడు... 

Chahal-Sanju Samson

సంజూ గురించి తలుచుకోగానే నాకు మొదట గుర్తించే సంఘటన ఇదే...’ అంటూ చెప్పుకొచ్చాడు పర్పుల్ క్యాప్ హోల్డర్ యజ్వేంద్ర చాహాల్..

13 మ్యాచుల్లో 8 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆఖరి మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా చివరి మ్యాచ్‌లో ఓడినా సంజూ టీమ్‌కి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి..

click me!