అసలే ఫామ్‌లో లేడు, దానికి తోడు... అజింకా రహానేకి గాయం, ఐపీఎల్ 2022 సీజన్‌తో పాటు డిసైడర్ టెస్టుకి...

Published : May 16, 2022, 04:59 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకే కాదు, టెస్టు మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానేకి కూడా ఈ మధ్య టైమ్ అస్సలు బాగోలేనట్టు ఉంది. ఐపీఎల్‌లో బేస్ ప్రైజ్‌కి కేకేఆర్ జట్టుకి వెళ్లిన అజింకా రహానే, ఇప్పటిదాకా కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు...

PREV
110
అసలే ఫామ్‌లో లేడు, దానికి తోడు... అజింకా రహానేకి గాయం, ఐపీఎల్ 2022 సీజన్‌తో పాటు డిసైడర్ టెస్టుకి...
Cheteshwar Pujara , Ajinkya Rahane

మెల్‌బోర్న్ టెస్టు సెంచరీ తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్న అజింకా రహానే, సౌతాఫ్రికా టూర్ తర్వాత శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు...

210
Pujara and Rahane

టెస్టు మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానేతో పాటు మూడేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారాకి కూడా ఈ టెస్టు సిరీస్‌లో చోటు కల్పించలేదు బీసీసీఐ. రంజీ ట్రోఫీ ఆడి, ఫామ్ నిరూపించుకోవాలని కోరింది...

310

రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసినా, ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌లతో సెలక్టర్లను ఇంప్రెస్ చేయలేకపోయాడు అజింకా రహానే. మరోవైపు ఛతేశ్వర్ పూజారా... రంజీతో పాటు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో శతకాల మోత మోగిస్తూ రీఎంట్రీ గ్యారెంటీ చేసుకున్నాడు...

410

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా, ఇప్పటికే నాలుగు సెంచరీలు (అందులో రెండు డబుల్ సెంచరీలు) చేసి 700+ పరుగులు చేశాడు. దీంతో పూజారా కమ్‌బ్యాక్ గ్యారెంటీ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్డ్స్..

510
Ajinkya Rahane

అసలే ఫామ్‌లో లేక ఏడుస్తుంటే, తాజాగా హర్మ్‌స్ట్రింగ్ గాయం అజింకా రహానేని దెబ్బేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో హర్మ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడిన అజింకా రహానే, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు...

610

అజింకా రహానే గైర్హజరీ, కేకేఆర్‌ని పెద్దగా ఇబ్బందిపెట్టకపోవచ్చు. 7 మ్యాచుల్లో కలిపి 133 పరుగులే చేసిన అజింకా రహానే, 103 స్ట్రైయిక్ రేటుతో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అదీకాక కేకేఆర్‌కి మిగిలింది ఇక ఒక్క మ్యాచ్ మాత్రమే...

710
Ajinkya Rahane

గాయం కారణంగా జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌లో జరగనున్న డిసైడర్ టెస్టుకి అజింకా రహానే దూరం కానున్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచులు పూర్తి కాగా, భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు, కరోనా కేసుల కారణంగా వాయిదా పడింది.

810

నాలుగు టెస్టుల సిరీస్‌కి భారత జట్టుకి కోచ్‌గా రవిశాస్త్రి, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తే, ఇంగ్లాండ్ జట్టుకి కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్, కెప్టెన్‌గా జో రూట్ వ్యవహరించాడు. అయితే నిర్ణయాత్మక ఐదో టెస్టుకి మాత్రం పూర్తిగా కొత్తవాళ్లు రానున్నారు.

910
Rahul Dravid

ఇంగ్లాండ్ టెస్టు కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ వ్యవహరించబోతుంటే భారత జట్టుకి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండబోతున్నారు...

1010
Ajinkya Rahane

అజింకా రహానే గాయం కారణంగా తప్పుకోవడంతో ఈ టెస్టులో హనుమ విహారి ఆడడం ఖాయంగా మారింది. ఒకవేళ గాయపడకపోయినా అజింకా రహానేకి భారత జట్టులో తిరిగి చోటు దక్కేదా? అనేది అనుమానమే... 

click me!

Recommended Stories