ఎమ్మెస్ ధోనీకి వాళ్లిద్దరి సపోర్ట్ ఉంది, నాకు ఎవ్వరూ లేరు... యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Published : Apr 30, 2022, 02:22 PM IST

రావాల్సినంత క్రేజ్, దక్కాల్సినంత క్రెడిట్ దక్కకపోయినా... భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. అయితే యువీ కెరీర్ అనుకున్నంత సాఫీగా ముగియలేదు...

PREV
113
ఎమ్మెస్ ధోనీకి వాళ్లిద్దరి సపోర్ట్ ఉంది, నాకు ఎవ్వరూ లేరు... యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: Getty Images

భారత జట్టులో చోటు కోల్పోయి, కొన్నేళ్ల పాటు వెయిట్ చేసిన యువరాజ్ సింగ్... ఆ తర్వాత నిరాశగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు... భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించిన యువీ, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆడిన ఇన్నింగ్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

213

2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేయగా అతనికి అవతలి ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు...

313

29 పరుగులు చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్... 21 బంతులాడినా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోగా 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు...

413

ఎమ్మెస్ ధోనీ ఆఖర్లో 7 బంతులాడి 4 పరుగులే చేయడంతో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఈజీగా ఛేదించి... టైటిల్ కైవసం చేసుకుంది లంక.

513
Image Credit: Getty Images

‘టీ20 వరల్డ్ కప్ 2014 సమయంలో నా కాన్ఫిడెన్స్ ఘోరంగా దెబ్బతింది. జట్టులో నాకు చోటు ఉండదు, నన్ను తీసేస్తారనే భయం నాలో పెరిగిపోయింది. అయితే ఆ భయానికి ఎవ్వరూ కారణంగా చెప్పలేను.

613
Image Credit: Getty Images

టీమ్‌లో అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. గ్యారీ కిర్‌స్టన్ కోచ్‌గా తప్పుకున్నా డంకెన్స్ టైమ్‌లో టీమ్‌లో వాతావరణం చాలా మారిపోయింది. ఎమ్మెస్ ధోనీ టీమ్‌లో చాలా మార్పులు చేశాడు..

713

అదే నాలో తీవ్రమైన ఒత్తిడి పెంచింది. ఆ ప్రెషర్ కారణంగా ఫైనల్ మ్యాచ్‌లో నేను ఒక్క షాట్ కూడా ఆడలేకపోయాను. స్పిన్నర్ల బౌలింగ్‌లో కొట్టాలని చూసినా వర్కవుట్ కాలేదు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లోనూ కొట్టడానికి ప్రయత్నించినా బ్యాటుకు తగ్గలేదు...

813

ఇంకా ఎక్కువ సేపు క్రీజులో ఉండకూడదని అవుట్ అవ్వడానికి కూడా ప్రయత్నించా... అది కూడా వర్కవుట్ కాలేదు. ఆ ఇన్నింగ్స్ తర్వాత నా కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా...

913

అయితే అలాంటి పరిస్థితులను అంగీకరించినప్పుడే, జీవితానికి అసలైన అర్థం బోధపడుతుంది. ఓటములను అంగీకరించి ముందుకు నడవాల్సి ఉంటుంది. మాహీని చూడండి. అతని కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు.

1013

కెరీర్ ముగింపు దశలో మాహీకి విరాట్ కోహ్లీ నుంచి రవిశాస్త్రి నుంచి చాలా మద్ధతు లభించింది. 2019 వరల్డ్ కప్‌లో అతన్ని ఆడించారు. తాను ఆడాలని అనుకున్నంత వరకూ ఆడాడు...

1113

దాదాపు 350 మ్యాచులు ఆడాడు. అయితే మాహీకి దక్కినట్టుగా భారత క్రికెట్‌లో అందరికీ అలాంటి సపోర్ట్ దక్కదు. నా విషయంలో కూడా అదే జరిగింది...

1213

నేనే కాదు హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ వంటి చాలామంది క్రికెటర్లకు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి సరైన సపోర్ట్ దక్కలేదు...

1313

రెండు మూడు మ్యాచులు సరిగా ఆడలేదంటే నీ ప్లేస్‌కి గ్యారెంటీ లేదని చెప్పేసేవాళ్లు. అలాంటప్పుడు బ్యాటింగ్‌పై, లేదా బౌలింగ్‌పై ఎలా ఫోకస్ పెట్టగలరు.. 2011 వరల్డ్ కప్ తర్వాతే పరిస్థితి ఇలా తయారైంది...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్... 

Read more Photos on
click me!

Recommended Stories