ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైనల్ చేరే రెండు జట్లు ఇవే... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...

Published : Apr 30, 2022, 01:55 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆరంభించిన జట్లు అదరగొడుతుంటే, భారీ అంచనాలతో బిగ్గెస్ట్ బ్రాండ్స్‌తో బరిలో దిగిన జట్లు ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితుల్లో పడ్డాయి. ఇప్పటికే సగానికి పైగా మ్యాచులు ముగియడంతో ప్లేఆఫ్స్ చేరే జట్లపై ఓ అంచనా వచ్చేసింది...

PREV
19
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైనల్ చేరే రెండు జట్లు ఇవే... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆఖరి ప్లేస్‌లో నిలుస్తుందేమోనని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ భావించిన గుజరాత్ టైటాన్స్ జట్టు, అన్యూహ్యంగా టేబుల్ టాపర్‌గా నిలబడి, ప్లేఆఫ్స్ చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది...

29

మొదటి 8 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్, మరో మ్యాచ్ గెలిస్తే... ఏ టీమ్‌తో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది...

39

అలాగే గత 3 సీజన్లలో ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ కూడా ఈసారి బెటర్ పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది...

49

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో టేబుల్ టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ని ప్లేఆఫ్స్ చేరకుండా ఏ జట్టూ ఆపలేదు. వాళ్లకి గెలవడం ఎలాగో బాగా తెలిసిపోయింది... 

59

మంచి పొజిషన్‌లో ఉన్నా, ఆఖరి ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నా విజయానికి సీక్రెట్ వాళ్లకి తెలిసిపోయింది. గెలుస్తామనే ధీమా ఉంటే, వాళ్లని ఆపడం అంత ఈజీ కాదు..

69

అలాగే రాజస్థాన్ రాయల్స్‌కి పటిష్టమైన జట్టు ఉంది. వాళ్లు స్థాయికి తగ్గట్టుగా ఆడుతున్నారు. ఇప్పుడున్న రాజస్థాన్ టీమ్‌ని చూస్తుంటే 2008లో టైటిల్ గెలిచిన షేన్ వార్న్ జట్టు గుర్తుకు వస్తోంది...

79

పేపర్ మీద ఎలా ఉన్నా, క్రీజులో బెటర్ పర్ఫామెన్స్ ఇస్తే చాలు. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు అదే చేస్తున్నాయి. విజయాలు వస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంటుంది.

89

ఓటముల గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. అందరి ముఖాల్లో నవ్వులు ఉంటాయి. అందరూ తర్వాతి మ్యాచ్ గెలుస్తామనే ఆలోచిస్తారు. అలాంటి వాతావరణమే విజయాలు తెచ్చిపెడుతుంది...

99

ఈ రెండు కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. నాకు తెలిసి వాళ్లు కూడా టైటిల్ వేటలో ముందంజలో ఉంటారు... గుజరాత్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో రెండు జట్లు ఫైనల్ చేరతాయి...’ అని కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్. 

click me!

Recommended Stories