విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడినా, వారికి రోహిత్ శర్మ అంటేనే బాగా ఇష్టం... ఎందుకంటే...

Published : Apr 30, 2022, 12:51 PM IST

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... టీమిండియాలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు. ఒకరికి వైట్ బాల్ క్రికెట్‌లో తిరుగులేని రికార్డు ఉంటే, మరొకరు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించగలరు. విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ సాధించి, ఆ పొజిషన్ నుంచి వైదొలిగితే... ఇప్పుడు రోహిత్ శర్మ ఆ బాధ్యతలు తీసుకున్నాడు...

PREV
110
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడినా, వారికి రోహిత్ శర్మ అంటేనే బాగా ఇష్టం... ఎందుకంటే...

ఎమ్మెస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న విరాట్ కోహ్లీ... భారత జట్టును ఐదేళ్ల పాటు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 గా నిలిపాడు. విరాట్ కెప్టెన్సీలో భారత జట్టు అత్యంత పటిష్టంగా తయారైంది...

210

జస్ప్రిత్ బుమ్రాతో పాటు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహార్, మహ్మద్ సిరాజ్ వంటి ఎందరో యువ ప్లేయర్లు... విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాకి వచ్చి స్టార్లుగా మారారు...

310

యజ్వేంద్ర చాహాల్ కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తర్వాతే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, స్టార్ స్పిన్నర్‌గా తయారయ్యాడు... అయితే వీరిలో మహ్మద్ సిరాజ్ మినహా మిగిలిన ప్లేయర్లందరికీ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ అంటేనే ఇష్టం...

410

ఆర్‌సీబీలో కీలక సభ్యుడిగా విరాట్ కోహ్లీకి నమ్మకమైన బౌలర్‌గా ఉంటూ వచ్చిన యజ్వేంద్ర చాహాల్.. రోహిత్ శర్మ, తనకు సొంత అన్నకంటే ఎక్కువ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు...
 

510

విరాట్ కెప్టెన్సీలో ఎంట్రీ ఇచ్చినా రోహిత్ శర్మ అంటే ఎక్కువ ఇష్టపడడానికి ప్రధానకారణం అతను ప్లేయర్లతో నడుచుకునే విధానం.

610

కోహ్లీ కెప్టెన్‌గా ప్లేయర్లకు అవసరాన్ని తెలుసుకుని, వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు... వారి నుంచి నూరు శాతం రిజల్ట్ రాబట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తూ మోటివేట్ చేస్తుంటాడు...

710

అయితే రోహిత్ శర్మ స్టైల్ వేరు. రోహిత్ శర్మ, కెప్టెన్‌గా కంటే ముందు ఓ స్నేహితుడికి వారికి దగ్గరవ్వడానికి ప్రాధాన్యం ఇస్తాడు. టీమ్ మేట్స్‌తో కలిసి కాఫీ షాపులకు, రెస్టారెంట్లకు వెళ్లి, వారితో సమయాన్ని గడుపుతాడు...

810

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న సమయంలో భారత జట్టు సభ్యులతో కలిసి రోహిత్ శర్మ రెస్టారెంట్‌కి వెళ్లడంతో కరోనా ప్రోటోకాల్‌ని ఉల్లంఘించారంటూ ఆస్ట్రేలియా మీడియా పెద్ద రచ్చే చేసింది...
 

910

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తప్పు చేస్తే తిడతాడనే భయం ప్లేయర్లలో నింపితే, రోహిత్ శర్మ మాత్రం స్నేహితుడిగా కలిసిపోయి... తప్పు చేసినా తనవాడిలా చూసుకుంటాడనే భరోసా నింపాడు...

1010

అందుకే రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారీ అంచనాలతో టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు, టైటిల్ గెలుస్తుందని ధీమాగా ఉన్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories