టెండూల్కర్ సలహా విని అవుట్ అయ్యా.. మురళీధరన్ బౌలింగ్‌పై యువరాజ్ సింగ్ కామెంట్స్...

First Published May 2, 2022, 6:03 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఎమ్మెస్ ధోనీకి ఇచ్చినట్టుగా తనలాంటి సీనియర్ ప్లేయర్లకు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదని షాకింగ్ కామెంట్లు చేసిన యువీ, తాజాగా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి తెలియచేశాడు...

‘నా చిన్నతనం నుంచి ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్స్‌పై ఎలా ఆడాలో మా నాన్న సిద్ధం చేశారు. ఆయన తడిపిన టెన్నిస్ బాల్స్‌తో 17 యార్క్ వికెట్‌పై బౌలింగ్ చేసేవారు.. 

అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయనకి తెలుసు. అందుకే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు భయపడకుండా, ఇబ్బందిపడకుండా ముందు నుంచే నన్ను సిద్ధం చేశారు...

Latest Videos


ఎలాంటి పేస్ బౌలింగ్‌నైనా ఎదుర్కోగలననే ధీమా, ధైర్యం నా చిన్నతనంలోనే వచ్చింది. అందుకే కెరీర్ ఆరంభంలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టూర్లలో కూడా చాలా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాను...

అయితే స్పిన్ బౌలింగ్‌ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడేవాడిని. ముఖ్యంగా షార్జా నుంచి శ్రీలంక టూర్‌కి వెళ్లిన తర్వాత ముత్తయ్య మురళీధరన్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. స్పిన్ బౌలింగ్‌లో నేను బాగానే ఆడేవాడిని కానీ అతనో వరల్డ్ క్లాస్ స్పిన్నర్...

Muttiah Muralitharan

అదీకాక నన్ను పెద్దగా అనుభవం లేదు. అందుకే ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌ను అర్థం చేసుకోలేకపోయాను. మురళీధరన్‌ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై సచిన్ టెండూల్కర్‌తో చర్చించాను...

టెండూల్కర్ అప్పటికే మురళీధరన్‌ బౌలింగ్‌లో ఎన్నో పరుగులు చేశారు. ఆయన నాకు స్వీప్ షాట్ ఆడడం నేర్చుకొమ్మని చెప్పాడు. అయితే సచిన్ సలహా విని నేను, స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి చాలాసార్లు అవుట్ అయ్యా...

అయితే కొన్నాళ్ల తర్వాత అదే స్వీప్ షాట్స్ ఆడుతూ స్పిన్నర్లపై ఆధిపత్యం చూపించడం మొదలెట్టా... సచిన్ సలహాని పక్కాగా అమలు చేయడానికి నాకు కొంత సమయం పట్టింది...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...
 

click me!