రాహుల్ త్రిపాఠిని ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇప్పటికే టీమిండియాకి... డేల్ స్టెయిన్ కామెంట్స్...

Published : May 02, 2022, 05:09 PM IST

ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచులు ఆడి 228 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠికి, ఇప్పటిదాకా టీమిండియా నుంచి పిలుపు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఆరెంజ్ ఆర్మీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్...  

PREV
17
రాహుల్ త్రిపాఠిని ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇప్పటికే టీమిండియాకి... డేల్ స్టెయిన్ కామెంట్స్...

రాంఛీకి చెందిన రాహుల్ త్రిపాఠి, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన త్రిపాఠి, ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్నాడు...

27
Rahul Tripathi

ఐపీఎల్ కెరీర్‌లో 71 మ్యాచులు ఆడి 8 హాఫ్ సెంచరీలతో 140+ స్ట్రైయిక్ రేటుతో 1613 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని 2022 మెగా వేలంలో రూ.8 కోట్ల 50 లక్షల  భారీ ధరకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

37

‘రాహుల్ త్రిపాఠి త్వరలోనే టీమిండియా టీ20 టీమ్‌లో ఆడతాడని గట్టిగా నమ్ముతున్నా. ఐపీఎల్‌లో ఆడిన ప్లేయర్లకు, భారత క్రికెటర్ జట్టులో చోటు దక్కుతుంది...

47

ఐపీఎల్ వంటి సముద్రం నుంచి టీమ్‌కి కావాల్సిన ప్లేయర్లను ఏరుకుంటారు సెలక్టర్లు.. అయితే ఇప్పటిదాకా రాహుల్ త్రిపాఠికి టీమిండియా నుంచి పిలుపు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది...

57

రాహుల్ త్రిపాఠి వన్‌డౌన్‌లో ఆడతాడు. టీమిండియాలో ఆ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ ఉండడంతో రాహుల్ త్రిపాఠికి అవకాశం రావడం లేదనుకుంటా... అయితే త్రిపాఠి ఆటలో ఎంతో పరిణతి ఉంటుంది...

67

అతను తన ఆటతో టీమిండియా తలుపులను బాదుతున్నాడు. త్వరలోనే ఆ తలుపులు అతని కోసం తెరుచుకుని తీరతాయి...’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్...

77

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ కూడా రాహుల్ త్రిపాఠి ఆటపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘విరాట్ కోహ్లీ ఎంత కష్టపడతాడో రాహుల్ త్రిపాఠిలో మళ్లీ అలాంటి తపన, కష్టపడేతత్వం చూశా...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

click me!

Recommended Stories