విరాట్, రోహిత్, రాహుల్‌ కాదు, అతనికి బౌలింగ్ చేయడం కష్టం... ట్రెంట్ బౌల్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Published : May 02, 2022, 04:46 PM IST

ఐపీఎల్‌లో పెద్దగా సక్సెస్ కాకపోయినా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కరణ్ నాయర్. త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా అనుకున్నన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయిన కరణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్...

PREV
16
విరాట్, రోహిత్, రాహుల్‌ కాదు, అతనికి బౌలింగ్ చేయడం కష్టం... ట్రెంట్ బౌల్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
Trent Boult

గత సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన ట్రెంట్ బౌల్ట్, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కీలక బౌలర్‌గా మారాడు. 8 మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్, 8.57 ఎకానమీతో బౌలింగ్ చేశాడు..

26

తాజాగా తన బౌలింగ్‌లో బాగా ఆడగల బ్యాటర్‌ గురించి కామెంట్ చేశాడు ట్రెంట్ బౌల్ట్... ‘నేను ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో కానీ, ఐపీఎల్‌లో కానీ కరణ్ నాయర్‌కి బౌలింగ్ చేయలేదు... అయితే నెట్స్‌లో అతని ఆట చూసి షాక్ అయ్యా...

36

నేను వేసే ప్రతీ బంతిని పర్ఫెక్ట్‌ షాట్‌గా ఎలా మలచాలో కరణ్ నాయర్‌కి బాగా తెలుసు. అందుకే నా బౌలింగ్‌లో ఎలా ఆడాలో కరణ్ నాయర్‌కి బాగా తెలుసు...

46

నాకు విరాట్ కోహ్లీ వికెట్ తీయడమంటే చాలా ఇష్టం. అలాగే కేన్ విలియంసన్, జిమ్మీ నీశమ్ వికెట్లను తీయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తా. టిమ్ సౌథీ వికెట్ కూడా...

56

నా వరకూ మొదటి బంతికి విరాట్ కోహ్లీని, ఆ తర్వాతి బంతుల్లో జిమ్మీ నీశమ్, టిమ్ సౌథీలను అవుట్ చేయడమే నా డ్రీమ్ హ్యాట్రిక్... కేన్ విలియంసన్ నాకు చాలా మంచి స్నేహితుడు, అందుకే అతన్ని ఈ లిస్టు నుంచి తీసేశా...’ అంటూ నవ్వేశాడు ట్రెంట్ బౌల్ట్...

66

సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2022 సీజన్‌లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచులు గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది ఆర్ఆర్...

Read more Photos on
click me!

Recommended Stories