ఇదేం కెప్టెన్సీ అయ్యర్! మ్యాచ్ విన్నర్‌నే పక్కనబెట్టేస్తావా... శ్రేయాస్‌ అయ్యర్‌పై యువీ ఫైర్...

Published : Apr 29, 2022, 02:36 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని ఘనంగా ఆరంభించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 9 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న కేకేఆర్, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచి తీరాల్సిందే...

PREV
17
ఇదేం కెప్టెన్సీ అయ్యర్! మ్యాచ్ విన్నర్‌నే పక్కనబెట్టేస్తావా... శ్రేయాస్‌ అయ్యర్‌పై యువీ ఫైర్...

గత సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, అతన్ని పక్కనబెట్టి భారీ ధరకు శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించింది...

27

ఆరంభ మ్యాచుల్లో కెప్టెన్సీలో మెచ్యూరిటీ చూపించి ఫ్యాన్స్‌ని, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని మెప్పించిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది...

37

‘ప్యాట్ కమ్మిన్స్‌ని తప్పించారా? లేక అతనికి గాయమైందా? కమ్మిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌.. తుదిజట్టులో లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది... 

47

రెండు మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రాన మ్యాచ్ విన్నర్లపైనే నమ్మకం కోల్పోతారా? అంటే వాళ్లే వరుసగా మూడు మ్యాచుల్లో గెలిపించాలా? నాకు అర్థం కాలేదు...’ అంటూ ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్...

57

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఘన విజయాన్ని అందించాడు ప్యాట్ కమ్మిన్స్. అయితే బంతితో మాత్రం కమ్మిన్స్ మెప్పించలేకపోతున్నాడు...

67

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 4 వికెట్లు మాత్రమే తీయగలిగిన ప్యాట్ కమ్మిన్స్, 12 ఎకానమీ రేటుతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి భారీగా పరుగులు సమర్పించాడు...

77

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్, టిమ్ సౌథీలతో బరిలో దిగింది కేకేఆర్. అయితే ఈ నలుగురూ బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు.

click me!

Recommended Stories