వికెట్ తీసిన తర్వాత ఛేతన్ సకారియా వెరైటీ సెలబ్రేషన్స్... డ్రాగన్ బాల్ జీ స్టైల్ సిగ్నేచర్‌తో...

Published : Apr 29, 2022, 01:59 PM ISTUpdated : Apr 29, 2022, 02:02 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చి, టీమిండియాలోకి ఎంట్రీ కూడా ఇచ్చేసిన యంగ్ పేసర్ ఛేతన్ సకారియా. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరుపున ఆడిన ఛేతన్ సకారియా, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు...

PREV
17
వికెట్ తీసిన తర్వాత ఛేతన్ సకారియా వెరైటీ సెలబ్రేషన్స్... డ్రాగన్ బాల్ జీ స్టైల్ సిగ్నేచర్‌తో...
Chetan Sakariya

ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.4.20 కోట్లకు ఛేతన్ సకారియాని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, మొదటి 7 మ్యాచుల్లో అతన్ని ఆడించనే లేదు...

27

లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, యశ్ ధుల్ వంటి ప్లేయర్ల కారణంగా ఫస్టాఫ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన ఛేతన్ సకారియా, సెకండాఫ్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఆరంగ్రేటం చేశాడు.

37

ఢిల్లీ తరుపున ఆడుతున్న మొదటి మ్యాచ్‌లో మొదటి ఓవర్ మూడో బంతికే ఆరోన్ ఫించ్‌ని క్లీన్ బౌల్డ్ చేసి, ఆకట్టుున్నాడు ఛేతన్ సకారియా... ఈ వికెట్ తర్వాత సకారియా చేసుకున్న సెలబ్రేషన్స్‌, అందరి దృష్టిని ఆకర్షించాయి.

47

గత సీజన్‌లో వికెట్ తీసిన తర్వాత చేతులు మలుచుకుని ప్రార్థన చేస్తున్నట్టుగా సిగ్నేచర్‌ స్టైల్‌తో సెలబ్రేట్ చేసుకున్న ఛేతన్ సకారియా... ఈ సారి డ్రాగన్ బాల్ జీ స్టైల్‌ స్టిల్‌తో వికెట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు...

57

‘నా సెలబ్రేషన్స్‌ని చాలా మంది జుబాన్ కేసరి అనుకుంటున్నారు. చిన్న క్లారిఫికేషన్ అది డ్రాగన్ బాల్ జీ... డ్రాగన్స్ ఇన్‌స్టంట్ టెలిపోర్ట్. చిన్నప్పుడు నా ఫెవరెట్ యానిమీ... అది’ అంటూ ట్వీట్ చేశాడు సకారియా...

67

‘ఆ సెలబ్రేషన్స్‌లో ఓ చిన్న సెంటిమెంట్, ఎమోషన్ కూడా ఉంది. ఇది మా నాన్న కోసం. ఆయన ఎప్పుడూ నా గురించే ఆలోచించేవారు. అంతర్జాతీయ స్థాయిలో నేను వికెట్లు తీస్తుంటే చూడాలని కలలు కన్నారు..’ అంటూ చెప్పుకొచ్చాడ ఛేతన్ సకారియా...
 

77

ఐపీఎల్ 2021 సీజన్‌కి ఎంపికైన సమయంలో ఛేతన్ సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన సకారియా, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయడానికి ముందు ఆయన తండ్రి కరోనాతో ప్రాణాలు విడిచారు...

click me!

Recommended Stories