అమ్మకిచ్చిన మాట కోసం ఐపీఎల్‌లో అడుగుపెట్టి... రోవ్‌మెన్ పావెల్ కథ వింటే..

Published : Apr 29, 2022, 01:19 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో విండీస్ బారీ హిట్టర్ రోవ్‌మెన్ పావెల్‌ని రూ.2 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ ఫినిషర్ అవుతాడని భావించిన రోవ్‌మెన్ పావెల్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీకి విజయాన్ని అందించాడు...

PREV
17
అమ్మకిచ్చిన మాట కోసం ఐపీఎల్‌లో అడుగుపెట్టి... రోవ్‌మెన్ పావెల్ కథ వింటే..

147 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో పృథ్వీ షా, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. డేవిడ్ వార్నర్ 42 పరుగులతో రాణించినా కీలక సమయంలో అవుటై పెవిలియన్ చేరాడు...

27

అయితే ఆఖర్లో 16 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విండీస్ బ్యాటర్ రోవ్‌మెన్ పావెల్, శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు...

37

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాది, ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆశలు రేపాడు పావెల్. నాలుగో బంతికి నో బాల్ ఇవ్వకపోవడంపై పెద్ద రచ్చే జరిగింది...
 

47

‘రోవ్‌మెన్ పావెల్ జీవితం చాలా చిత్రంగా ఉంటుంది. అతని జీవిత కథ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో ఓ 10 నిమిషాల వీడియో కూడా ఉంది చూడండి...

57

రోవ్‌మెన్ పావెల్, ఐపీఎల్ ఆడుతున్నందుకు నాతో పాటు చాలామంది సంతోషిస్తూ ఉంటారు. అతను చాలా కింది నుంచి పైకి వచ్చాడు... పేదరికాన్ని జయించడానికి ఆటను ఎంచుకున్నాడు...

67

స్కూల్‌ చదువుతున్నప్పుడే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తానని వాళ్ల అమ్మకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోవడానికే కష్టపడుతూ ఉన్నాడు...

77

జమైకాలోని ఓల్డ్ హర్బర్‌లో జన్మించిన రోవ్‌మెన్ పావెల్‌కి తండ్రి లేడు. తల్లి, సోదరితో పెరిగిన పావెల్, చిన్నతరంలో కడుపునిండా తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ బిషప్... 

click me!

Recommended Stories