ప్రపంచంలో ఏ జట్టు సరిగా ఆడకపోయినా ఐపీఎల్‌ను ఆడిపోసుకుంటూ ఉంటారు. తాజాగా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఘోర పరాజయానికి కూడా ఐపీఎల్‌యే కారణమంటూ వాపోయారు కొందరు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు. అయితే ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాత్రం ఐపీఎల్ వల్ల టీ20 వరల్డ్ కప్ జట్టు తయారవుతుందని అంటున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆస్ట్రేలియా జట్టు నుంచి మెజారిటీ ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమ్మిన్స్, జోష్ హజల్‌వుడ్, డేవిడ్ వార్నర్ వంటి కీ ప్లేయర్లు వేలంలో భారీ ధర దక్కించుకున్నారు...
29
ఐపీఎల్ 2022 సీజన్ మార్చి నెలఖరున ప్రారంభమై, మే నెల చివరన ముగుస్తుంటే... అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రారంభం కానుంది...
39
‘ఐపీఎల్ కారణంగా వరల్డ్ క్వాలిటీ ప్లేయర్లతో కలిసి ఆడే అవకాశం దొరుకుతుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఐపీఎల్ మా ప్రిపరేషన్స్‌కి బాగా ఉపయోగపడుతుంది...
49
ఐపీఎల్ 2021 టోర్నీలో ఆడిన తర్వాత జోష్ హజల్‌వుడ్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఎలా పర్ఫామ్ చేశాడో అందరికీ తెలిసిందే...
59
కాబట్టి ఐపీఎల్ వల్ల మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, అదీకాక ఎన్నో గొప్ప లాభాలు ఉన్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో అయ్యే డిస్కర్షన్స్, ప్లేయర్లను మెంటల్‌గా ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధమయ్యేలా చేస్తాయి...
69
వరల్డ్‌లో ది బెస్ట్ ప్లేయర్లతో కలిసి ఆడినప్పుడు వారి విలువైన అనుభవాన్ని కూడా పంచుకునే అవకాశం దొరుకుతుంది...
79
నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు ఈ విషయం చెప్పాను. 2008 నుంచి క్రికెట్‌కి ఇంత క్రేజ్ మొదలైంది, దానికి కారణం ఐపీఎల్..
89
వివిధ దేశాల నుంచి ప్లేయర్లను తీసుకొచ్చి, ఓ జట్టుగా ఆడించాలనే ఆలోచనే చాలా వినూత్నమైనది. ప్లేయర్లు, కోచ్‌లు కలిసినప్పుడు ఆ ప్రభావం మరో లెవెల్‌లో ఉంటుంది...
99
ఐపీఎల్ ప్రారంభమయ్యాక ఆస్ట్రేలియా అయితే లాభపడింది. మరికొంత మంది ప్లేయర్లు, ఆస్ట్రేలియా నుంచి ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా తాత్కాలిక కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్...