ఐపీఎల్‌లో అదరగొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వారిలో ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఒకడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన షేన్ వాట్సన్, సీఎస్‌కే తరుపున ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు...
2014 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా, వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ఓవర్ సీస్ ప్లేయర్‌గా నిలిచిన షేన్ వాట్సన్... ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు...
211
షేన్ వాట్సన్‌కి భారత మాజీ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాజాగా వీళ్లిద్దరి మధ్య తేడాలను వివరించాడు వాట్సన్...
311
‘విరాట్, లీడర్‌గా అద్భుతాలు చేశాడు. ఆటలో అతను నూరు శాతం ఇవ్వడమే కాకుండా ప్లేయర్లను కూడా నూటికి నూరు శాతం ఇచ్చేలా చేస్తాడు విరాట్...
411
విరాట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రతీ ఆటలోనూ ఆ బరువును విరాట్ మోస్తూనే ఉంటాడు. విరాట్‌కి అది చాలా ఇష్టమైన పని కూడా...
511
విరాట్ కోహ్లీ నా దృష్టిలో ఓ సూపర్ హ్యూమన్. తన చుట్టూ ఉన్న ప్లేయర్లతో ఆటలో లీనం చేయడంలో విరాట్ తర్వాతే ఎవ్వరైనా...
611
వ్యక్తిగానూ విరాట్ చాలా మంచివాడు. ఆఫ్ ఫీల్డ్‌లో ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో విరాట్‌కి బాగా తెలుసు... క్రికెట్‌పై అతనికి అమితమైన నాలెడ్జ్ ఉంది...
711
ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీతో కలిసి ఆడడం నాకు ఓ అద్భుతమైన అనుభవం... విరాట్‌తో పోలిస్తే ఎమ్మెస్ ధోనీ చాలా భిన్నమైన వ్యక్తిత్వం కలవాడు...
811
ఎమ్మెస్ ధోనీ ఒత్తిడిని తన భుజాలపై మోయడానికి సిద్ధంగా ఉంటాడు. ధోనీ, తన ప్లేయర్లను పూర్తిగా నమ్ముతారు. వారి బలాలపై వారికి నమ్మకం కలిగేలా చేస్తాడు...
911
అతనికి ఏం కావాలో, ఏం అవసరం లేదో ఎమ్మెస్ ధోనీకి బాగా తెలుసు. ఫీల్డ్‌లో తన అస్త్రాలను ఎప్పుడు ఎలా వాడాలో ధోనీకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు...
1011
అతను గుడ్డిగా ప్లేయర్లను నమ్మడు, వారిపై ఓ నిశితమైన పరిశోధనే చేస్తాడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు షేన్ వాట్సన్..
1111
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు షేన్ వాట్సన్. హెడ్ కోచ్ రికకీ పాంటింగ్ పావులు కదిపి, వాట్సన్‌ను ఢిల్లీ గూటికి చేర్చాడు...