గంగూలీ చేసిన పనికి వణికిపోయిన యువరాజ్ సింగ్... టీమిండియాలోకి వచ్చిన కొత్తలో...

Published : Apr 29, 2022, 03:45 PM IST

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలోకి ఎందరో యువ క్రికెటర్లు వచ్చారు, సత్తా చాటారు, స్టార్లుగా వెలుగొందారు. వారిలో యువరాజ్ సింగ్ ఒకడు. 2000 ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన యువీ, అప్పటి భారత సారథి గంగూలీ చేసిన ఓ పని కారణంగా నిద్రలేని రాత్రులు గడిపాడట...

PREV
110
గంగూలీ చేసిన పనికి వణికిపోయిన యువరాజ్ సింగ్... టీమిండియాలోకి వచ్చిన కొత్తలో...

18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యువరాజ్ సింగ్... ఆస్ట్రేలియా లెజెండ్స్ గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్‌లీలను ఎదుర్కొంటూ 80 బంతుల్లో 84 పరుగులు చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు...

210

యువీ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు 265 పరుగుల స్కోరు చేయగా, ఆస్ట్రేలియా 245 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో ఐసీసీ నాకౌట్ సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది టీమిండియా...

310

అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కి ముందు యువరాజ్ సింగ్ దగ్గరకి వెళ్లిన సౌరవ్ గంగూలీ... ‘రేపటి మ్యాచ్‌లో నువ్వు ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది..’ అని చెప్పాడట. దానికి ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న యువీ... ‘మీరు ఓపెనింగ్ చేయమంటే చేస్తాను...’ అని సమాధానం చెప్పాడట.

410
Image Credit: Getty Images

అయితే ‘దాదా వచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పడంతో ఆ ఆలోచనతో ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు... మొదటి మ్యాచ్, అదీ ఓపెనింగ్... ఆ టెన్షన్‌తో వణికిపోయా...

510

అయితే ఆ తర్వాతి రోజు గంగూలీ వచ్చి, సచిన్ టెండూల్కర్‌తో కలిసి తానే ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు... ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నా... 

610

మొదటి మ్యాచ్ ఆడబోతున్న నాతో ఆడుకోవాలని అలా ఫ్రాంక్ చేశానని చెప్పాడు. నేను ఆ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశా. క్రీజులోకి వెళ్తున్నప్పుడే ఫోకస్ అంతా బంతిని చూడడంపైనే పెట్టాలని ఫిక్స్ అయి వెళ్లా...

710

నేను ఆస్ట్రేలియాపై మొదటి మ్యాచ్‌లో చేసిన 37 పరుగుల వద్ద నాకు లైఫ్ దక్కింది. క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయా. అయితే ఆ మ్యాచ్‌లో 37 పరుగులు చేసినా ఎంతో సంతోషించేవాడిని. ఎందుకంటే అప్పటి బౌలింగ్ అటాక్ అలా ఉండేది... 

810

లక్కీగా ఆ మ్యాచ్‌లో 84 పరుగులు చేశా. ఇప్పటికీ ఆ రోజు ఎలా అన్ని పరుగులు చేయగలిగాననేది ఆశ్చర్యంగా ఉంటుంది. బాల్‌ని చూసి కొట్టాలనే ఫార్ములాతో ఆడాను...

910
Image Credit: Getty Images

Yuvraj also scored a career-best 150 in an ODI against England in Cuttack in January 2017 and was part of the India side that reached the finals of the Champions Trophy later that year. The all-rounder, who also played for several Indian Premier League (IPL) teams, announced his retirement in 2019, two years after his last appearance for India.

1010

ఆస్ట్రేలియాపై ఆడుతూ, వారిపై విజయం సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవడం నాకు చాలా పెద్ద మూమెంట్‌గా మిగిలిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్...

click me!

Recommended Stories