ఆర్‌సీబీ ఓడిపోతే కోహ్లీ కెప్టెన్సీని అన్నారు! రోహిత్‌ శర్మ విషయంలో మాత్రం బౌలర్లు లేరంటూ...

Published : Apr 14, 2022, 06:56 PM IST

విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ... ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో మరోసారి ఈ క్రికెట్ ఫ్యాన్ వార్ బయటికి వచ్చింది. ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోవడమే కారణంగా చూబుతూ విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీకి దూరం చేసింది బీసీసీఐ...  

PREV
113
ఆర్‌సీబీ ఓడిపోతే కోహ్లీ కెప్టెన్సీని అన్నారు! రోహిత్‌ శర్మ విషయంలో మాత్రం బౌలర్లు లేరంటూ...

ఐపీఎల్‌లో టైటిల్ గెలవకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. టీమిండియా కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన విరాట్‌కి ఇదే తీరని లోటుగా మిగిలిపోయింది.  
 

213

9 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ... 2016 సీజన్‌లో ఆర్‌సీబీని ఫైనల్ చేర్చగలిగాడు కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు...

313

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఆడిన గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్‌ అర్హత సాధించినా మొదటి ఎలిమినేటర్‌లో కేకేఆర్ చేతుల్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది...

413

ఇదే సమయంలో రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్‌కి గత 9 సీజన్లలో ఐదు టైటిల్స్ అందించాడు. ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన సారథిగా టీమిండియా కెప్టెన్సీ రేసులో నిలిచి, ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఆ బాధ్యతలు చేపట్టాడు.

513

టీమిండియా కెప్టెన్సీ తీసుకున్న తర్వాత జరుగుతున్న మొదటి ఐపీఎల్ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్‌ ఘోరంగా విఫలమవుతోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది ముంబై...

613

ఇంతకుముందు 2019 సీజన్‌లో ఆర్‌సీబీ కథ కూడా ఇదే. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఆ తర్వాత 8 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకుని ఆఖరి స్థానంలో నిలిచింది...
 

713

ఆర్‌సీబీ వరుసగా మ్యాచుల్లో ఓడిపోయినప్పుడు కెప్టెన్‌గా తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. విరాట్‌కి కెప్టెన్సీయే రాదని ఎద్దేవా చేశారు క్రికెట్ ఫ్యాన్స్..

813

ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ది ఇదే కథ. అయితే ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీపై కాకుండా, ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంపై విమర్శలు, ట్రోలింగ్ రావడం విశేషం...

913

జస్ప్రిత్ బుమ్రా తప్ప మరో స్టార్ బౌలర్ లేకపోవడం వల్లే ముంబై ఇండియన్స్ విజయాలు అందుకోలేకపోతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు ఆర్‌సీబీ కథ కూడా ఇదే...

1013

జట్టులో స్టార్ బ్యాటర్లు ఉన్నా, 200+ పరుగుల స్కోరు చేసినా దాన్ని కాపాడుకునేందుకు సరైన బౌలర్లు ఉండేవాళ్లు కాదు. అయినా విమర్శలన్నీ విరాట్‌ కెప్టెన్సీపైనే వచ్చేవి...

1113

జట్టులో స్టార్ బ్యాటర్లు ఉన్నా, 200+ పరుగుల స్కోరు చేసినా దాన్ని కాపాడుకునేందుకు సరైన బౌలర్లు ఉండేవాళ్లు కాదు. అయినా విమర్శలన్నీ విరాట్‌ కెప్టెన్సీపైనే వచ్చేవి...

1213

అప్పుడు విరాట్ కోహ్లీకి, ఇప్పుడు రోహిత్ శర్మకీ మధ్య ఉన్న తేడా కెప్టెన్‌గా గెలిచిన ఐపీఎల్ టైటిల్సే... హార్ధిక్ పాండ్యా, రాహుల్ చాహార్, కృనాల్ పాండ్యా, లసిత్ మలింగ, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్లేయర్లు ముంబై ఇండియన్స్‌లో ఉండడం రోహిత్‌కి కలిసి వచ్చింది...

1313

ముంబై ఇండియన్స్ లాంటి టీమ్‌, విరాట్‌కి ఉంటే ఐపీఎల్ టైటిల్స్ గెలిచేవాడని వీరూ ఇంతకుముందు కామెంట్ చేశాడు. ఈ సీజన్‌లో ముంబై పర్ఫామెన్స్ దాన్ని నిజం చేస్తోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories