ఐపీఎల్ ఇప్పటికి 14 సీజన్లు ముగిస్తే, అందులో 9 టైటిల్స్ కేవలం రెండు జట్ల దగ్గరే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు టైటిల్స్ గెలిచాయి. అయితే ఈసారి ఈ రెండు జట్లూ వరుస ఓటములను చవిచూస్తున్నాయి...
చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకోగా, ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసుకుంది...
29
గత సీజన్‌లో వరుస పరాజయాలను అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా, ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది...
39
Jasprit Bumrah
వచ్చే సీజన్‌లో అందుబాటులో ఉండే జోఫ్రా ఆర్చర్‌పై భారీ ఖర్చు చేసిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌పై పెద్దగా ఫోకస్ పెట్టనట్టే కనిపిస్తుంటే, దీపక్ చాహార్ గాయంతో తప్పుకోవడం చెన్నైని తీవ్రంగా దెబ్బ తీసింది...
49
ఈ రెండు జట్లూ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొదటి రోజు కేవలం నలుగురు ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేయడం విశేషం...
59
రెండో రోజు స్పీడ్ పెంచి, దొరికిన ప్లేయర్లను దొరికిన కాడికి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్... భారీ మూల్యం చెల్లించుకోబోతున్నట్టే కనిపిస్తోంది...
69
‘నేను ఇంతకుముందు కూడా చెప్పా. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి సక్సెస్‌ఫుల్ టీమ్స్ బాటమ్‌లో ఉండడం చాలా మంచిది... వాళ్లు అక్కడుంటేనే బాగుంటుంది...
79
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌నే చూసుకుంటే... 190 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదిస్తున్నప్పుడు రెండు రనౌట్లు పడితే, తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చి గెలవడం చాలా కష్టం...
89
సూర్యకుమార్ యాదవ్‌కి ఆఖరి ఓవర్ ఓడియన్ స్మిత్ కానీ లేదా లియామ్ లివింగ్‌స్టోన్ కానీ బౌలింగ్ చేస్తాడని తెలియకపోవచ్చు. కాబట్టి ఆఖరి ఓవర్‌కి ముందే కావాల్సినన్ని పరుగులు చేయాలని ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
99
ముంబై, సీఎస్‌కే కాస్త విశ్రాంతి తీసుకుంటే ఈ సారి కొత్త ఛాంపియన్‌ని చూసేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్రతీసారి ఆ ఇద్దరే గెలిస్తే పరమ రోటీన్‌గా,. బోరింగ్‌గా మారుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...