బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడుకున్నారా... ఉమేశ్ యాదవ్, షెల్డన్ జాక్సన్ పర్ఫామెన్స్‌లతో...

Published : Mar 26, 2022, 09:34 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది కేకేఆర్. గత సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ టాపార్డర్‌ను కకావికలం చేసిన కేకేఆర్ బౌలర్లు, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ వంటి భారీ హిట్టర్లను కూడా షాట్లు కొట్టకుండా చాలాసేపు నిలువరించగలిగారు...

PREV
113
బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడుకున్నారా... ఉమేశ్ యాదవ్, షెల్డన్ జాక్సన్ పర్ఫామెన్స్‌లతో...

ఐపీఎల్ 2022 సీజన్‌ను అదిరిపోయే ఓవర్‌తో ఆరంభించాడు కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్. నో బాల్‌తో ఐపీఎల్ సీజన్‌ను ఆరంభించిన ఉమేశ్ యాదవ్, ఆ తర్వాత మూడో బంతికి వైడ్ వేశాడు...

213

ఇన్నింగ్స్ మూడో బంతికి ఐపీఎల్ 2021 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేసి, కేకేఆర్‌కి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు ఉమేశ్ యాదవ్...

313

తొలి ఓవర్2లో బ్యాటర్లకు పరుగులేమీ ఇవ్వని ఉమేశ్ యాదవ్, ఆ తర్వాత తన రెండో ఓవర్‌లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌ తొలి బంతికే వికెట్ తీశాడు ఉమేశ్...

413

8 బంతుల్లో 3 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో ఒకే పరుగు ఇచ్చాడు ఉమేశ్...

513

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో తిరిగి ఉమేశ్ యాదవ్‌కి బాల్ అందించాడు శ్రేయాస్ అయ్యర్. ఆ ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చిన ఉమేశ్ యాదవ్, 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు...

613

ఉమేశ్ యాదవ్ పర్ఫామెన్స్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ‘ఒకరి చెత్త, మరొకరి చేతుల్లో స్వర్ణంగా మారినట్టు ఉంది... ఉమేశ్ యాదవ్ పర్ఫామెన్స్ చూస్తుంటే...’ అంటూ వ్యాఖ్యానించాడు మాథ్యూ హేడెన్...

713

ఐపీఎల్‌లో మూడు సీజన్లు ఆర్‌సీబీ తరుపున ఆడిన ఉమేశ్ యాదవ్, 27 మ్యాచుల్లో 28 వికెట్లు తీశాడు. 2018లో 20 వికెట్లు తీసిన ఉమేశ్, 2019లో 8 వికెట్లు తీశాడు. 2020లో రెండు మ్యాచులాడి వికెట్ తీయలేకపోయాడు...

813

ఉమేశ్ యాదవ్‌ని 2021 సీజన్‌లో వేలానికి విడుదల చేసింది ఆర్‌సీబీ. ఉమేశ్‌ని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు...

913

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొదటి రౌండ్‌లో అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్‌ని, చివర్లో బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... మొదటి మ్యాచ్‌లో ఉమేశ్, అద్భుతంగా మెరిశాడు...

1013

అలాగే మెరుపు వికెట్ కీపింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు సౌరాష్ట్ర క్రికెటర్ షెల్డన్ జాక్సన్. రంజీ సీజన్ 2018-19లో 854 పరుగులు, 2019-2020 సీజన్‌లో 809 పరుగులు, రంజీ ఛాంపియన్‌గా నిలిచిన షెల్డన్ జాక్సన్‌కి ఐపీఎల్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు...

 

1113

ఇంతకుముందు కేకేఆర్, ఆర్‌సీబీ తరుపున ఆడిన షెల్డన్ జాక్సన్, తన కెరీర్‌లో ఇప్పటివరకూ 4 ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు...

1213

‘అదో అద్భుతమైన స్టంపింగ్... షెల్డన్ జాక్సన్ వికెట్ కీపింగ్ చూస్తుంటే ఎమ్మెస్ ధోనీ గుర్తుకువచ్చాడు. ’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

1313

విదేశీ క్రికెటర్ల మోజులో పడి, ఫారిన్ ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉండే ఫ్రాంఛైజీలు... ఉమేశ్ యాదవ్, షెల్డన్ జాక్సన్ వంటి భారత ప్లేయర్లను సరిగా వాడుకోవడం లేదని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్..

click me!

Recommended Stories