ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, బ్యాటింగ్‌లోనూ తిరుగులేని పర్ఫామెన్స్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్‌లో, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ 40.88 సగటుతో 4456 పరుగులు చేశాడు ఎమ్మెస్ ధోనీ...
టీమిండియా ప్లేయర్‌గా కెరీర్ ఎండింగ్‌లో నెమ్మదిగా ఆడుతూ ఫ్యాన్స్‌కి విసుగు తెప్పించిన ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్‌లో 2019 సీజన్ వరకూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు...
28
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఎమ్మెస్ ధోనీ బ్యాటు నుంచి మెరుపులు రావడం బాగా తగ్గిపోయింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో 200 పరుగులు చేసిన ధోనీ, 2021లో కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
38
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేకేఆర్‌పై మాహీ పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు. కేకేఆర్ సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, ఎమ్మెస్ ధోనీపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు...
48
సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఇప్పటివరకూ 66 బంతులు ఆడిన ఎమ్మెస్ ధోనీ, కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ మాత్రమే ఉంది...
58
పెద్దగా పరుగులు ఇవ్వలేకపోయినప్పటికీ ఐపీఎల్‌లో ఎమ్మెస్ ధోనీని ఒకేసారి అవుట్ చేయగలిగాడు సునీల్ నరైన్. నరైన్ బౌలింగ్‌లో చాలా జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు మాహీ...
68
ఇక కేకేఆర్ ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తికి, మాహీపై మంచి రికార్డు ఉంది. మొత్తంగా గత రెండు సీజన్లలో మూడు సార్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు ఎమ్మెస్ ధోనీ...
78
మొత్తంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న ధోనీ, 10 పరుగులు చేసి మూడు సార్లు అవుట్ అయ్యాడు... చక్రవర్తి బౌలింగ్‌లోనే ఒకే ఒక్క బౌండరీ కొట్టగలిగాడు ధోనీ...