ఐపీఎల్ 2022 టీఆర్పీని జైఅని పైకి లేపిన ఎమ్మెస్ ధోనీ... అమాంతం పడేసిన ఆర్‌సీబీ...

First Published Apr 24, 2022, 6:34 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ మొదటి రెండు వారాల టీఆర్పీ, గత సీజన్ కంటే ఘోరంగా పడిపోయిన విషయం తెలిసిందే. మొదటి వారం ఏకంగా 33 శాతం వ్యూయర్‌షిప్ పడిపోగా, రెండో వారం 18 శాతం తగ్గుదల కనిపించింది. మెగా సీజన్‌కి పెద్దగా రేటింగ్ రాకపోవడం బీసీసీఐని ఇబ్బంది పెడుతోంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీల ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆర్జించిన బీసీసీఐ, ప్రసారహక్కుల విక్రయం ద్వారా మరో రూ.35- 40 వేల కోట్లు ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

అయితే సరిగ్గా ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో ఐపీఎల్ సీజన్ 15 మొదలుకావడంతో ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది...

Latest Videos


అదీకాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు వరుస వైఫల్యాలు ఎదుర్కోవడం ఐపీఎల్ 2022 వ్యూయర్‌షిప్‌ని దెబ్బ తీసింది...

అయితే భారత మాజీ సారథి, సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్ టీఆర్పీని అమాంతం పైకి లేపాడు. ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌కి మంచి రేటింగ్ దక్కింది...
 

Image Credit: Getty Images (File Photo)

ఐపీఎల్ ‘El Clasico’ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా 6, 4, 2, 4 బాది... చెన్నై సూపర్ కింగ్స్‌కి రెండో విజయాన్ని అందించాడు ఎమ్మెస్ ధోనీ. మాహీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రియల్ టైం వ్యూస్ 8  మిలియన్లను దాటడం విశేషం... ఈ సీజన్‌లో ఇదే అత్యధికం...

అయితే మాహీ జై అంటూ పైకి లేపిన ఐపీఎల్ 2022 వ్యూయర్‌షిప్‌ని విరాట్ కోహ్లీ... అమాంతం పాతాళానికి పడేశాడు. ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ డకౌట్ కావడంతో ఈ మ్యాచ్‌ను పట్టించుకోలేదు ఫ్యాన్స్...

ఆర్‌సీబీ 68 పరుగులకే ఆలౌట్ కావడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించడంతో ఈ మ్యాచ్‌ని వీక్షించిన రియల్ టైం వ్యూస్ 29 లక్షలకు పైగా ఉండడం విశేషం...

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలు అందుకుని, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తే... ఐపీఎల్ 2022 సీజన్‌ రేటింగ్ పైకి లేచే అవకాశం ఉంది. లేదంటే ఈ సీజన్‌ ద్వారా బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

click me!