టీమిండియా గురించి ఆలోచించడం లేదు, ఐపీఎల్‌పైనే పూర్తి ఫోకస్... షాక్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా...

Published : Apr 24, 2022, 04:49 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి, టేబుల్ టాపర్‌గా నిలిచింది గుజరాత్ టైటాన్స్. భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో రాణించడమే కాకుండా కెప్టెన్‌గానూ జట్టును అద్భుతంగా నడిపిస్తూ వరుస విజయాలు అందిస్తున్నాడు..

PREV
19
టీమిండియా గురించి ఆలోచించడం లేదు, ఐపీఎల్‌పైనే పూర్తి ఫోకస్... షాక్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన గుజరాత్ టైటాన్స్, ఆరు విజయాలు అందుకుని... సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది... 

29

బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న హార్ధిక్ పాండ్యా, ఇప్పటిదాకా 6 మ్యాచులు ఆడి 73.75 సగటుతో 295 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో జోస్ బట్లర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

39

2022 సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొదటి కెప్టెన్‌గా నిలిచిన హార్ధిక్ పాండ్యా, 7.57 ఎకానమతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు కూడా తీసుకున్నాడు... 

49

హార్ధిక్ పాండ్యా ఫుల్లు ఫామ్‌లోకి రావడంతో అతను టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడడం ఖాయమని అనుకుంటున్నారంతా. అయితే పాండ్యా మాత్రం మరోలా స్పందించాడు...

59

‘నేనైతే ఇప్పుడు నా కమ్‌బ్యాక్ గురించి ఆలోచించడం లేదు. అదీకాకుండా నా కమ్‌బ్యాక్‌పై నేను ఫోకస్ కూడా చేయడం లేదు. ఇప్పుడు నా ఫోకస్ అంతా ఐపీఎల్‌పైనే...

69

నేను ఐపీఎల్ ఆడుతున్నప్పుడు దీనిపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నా. ఆ తర్వాత జరిగేవి జరుగుతాయి. అది నా చేతుల్లో లేదు... నేను ఏ జట్టు తరుపున ఆడితే, దాన్ని గెలిపించడం గురించే ఆలోచిస్తా...
 

79

ఇప్పటిదాకా మేం బాగా ఆడాం, ఆడుతున్నాం... మా పర్ఫామెన్స్ సంతోషాన్నిచ్చింది. కెప్టెన్సీ వల్ల నా ఆటతీరు నిజంగానే మెరుగైందని ఒప్పుకోవాల్సిందే...

89

నేను ఓ క్రికెటర్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఇన్నేళ్లు ఆడుతున్న ఆటపై కాస్తో కూస్తో అవగాహన ఉంది. అదే నాకు విజయాన్ని అందించింది...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...

99

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలో దిగని హార్ధిక్ పాండ్యా, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 67 పరుగులు చేసి కమ్‌బ్యాక్ ఇచ్చాడు...
 

click me!

Recommended Stories