క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఓ తిరుగులేని బ్యాటింగ్ సూపర్ స్టార్. 463 అంతర్జాతీయ వన్డేల్లో 18,426 పరుగులు చేసిన టెండూల్కర్, 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేసి... ‘క్రికెట్ గాడ్’గా కీర్తి ఘడించాడు.
బ్యాటింగ్ దిగ్గజంగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ బంతితోనూ చాలామంది బౌలింగ్ లెజెండ్స్ కంటే మెరుగైన రికార్డులు క్రియేట్ చేశాడని చాలామందికి తెలీదు...
26
వన్డేల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌పై ఐదేసి వికెట్లు తీసిన సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై నాలుగేసి వికెట్లు తీశాడు.. ఓవరాల్‌గా 463 వన్డేల్లో 154 వికెట్లు తీశాడు సచిన్ టెండూల్కర్...
36
సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 1342 ఓవర్లు బౌలింగ్ చేస్తే... పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ 1294, సౌతాఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ 1042 ఓవర్లు, ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 1019 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారు...
46
సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వన్డేల్లో 8054 బంతులు బౌలింగ్ చేయగా... షోయబ్ అక్తర్ 7764, డేల్ స్టెయిన్ 6256 బంతులు మాత్రమే బౌలింగ్ చేశారు. స్టువర్ట్ బ్రాడ్ 121 వన్డేల్లో 6109 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు...
56
టెస్టుల్లో మాత్రం సచిన్ టెండూల్కర్ కంటే ఈ ముగ్గురూ రెట్టింపు సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. టెస్టుల్లో మాస్టర్ సచిన్ 4240 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి 46 వికెట్లు పడగొట్టాడు...
66
షోయబ్ అక్తర్ తన టెస్టు కెరీర్‌లో 8143 బంతులు బౌలింగ్ చేయగా డేల్ స్టెయిన్ 18608 బంతులు బౌలింగ్ చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ 30575 బంతులు వేసి... అత్యధిక టెస్టులు ఆడిన పేసర్ల జాబితాలో ఉన్నాడు..