ఇదో వరస్ట్ టీమ్‌ మేనేజ్‌మెంట్... రూ.24 కోట్లు పెట్టి, బెంచ్‌ మీద కూర్చోబెడతారా! కేకేఆర్‌పై ట్రోల్స్...

Published : May 02, 2022, 10:43 PM IST

ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ ‌రైడర్స్ జట్టుకి రెండు టైటిల్స్ ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ఫైనల్ చేరి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ప్లేయర్ల విషయంలో మాత్రం కేకేఆర్, ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది... 

PREV
110
ఇదో వరస్ట్ టీమ్‌ మేనేజ్‌మెంట్... రూ.24 కోట్లు పెట్టి, బెంచ్‌ మీద కూర్చోబెడతారా! కేకేఆర్‌పై ట్రోల్స్...

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ పట్ల కేకేఆర్ ప్రవర్తించిన తీరు, ఐపీఎల్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మూడు సీజన్లలో కలిపి 14 మ్యాచులే ఆడిన కుల్దీప్ యాదవ్, ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...

210

ఐపీఎల్ 2019 సీజన్‌లో 9 మ్యాచులు, 2020 సీజన్‌లో 5 మ్యాచుల్లో మాత్రమే కుల్దీప్ యాదవ్‌కి అవకాశం ఇచ్చిన కేకేఆర్, ఆ తర్వాతి సీజన్‌లోనూ అతన్ని వేలానికి వదిలేయకుండా రిటైన్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..

310

అలాగే దినేశ్ కార్తీక్‌, శుబ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. బయటికి వచ్చిన తర్వాత వేరే జట్ల తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు..

410

ఐపీఎల్ 2021 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా వెంకటేశ్ అయ్యర్‌ని రూ.8 కోట్లకు రిటైన్ చేసుకున్న కేకేఆర్, యంగ్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా రూ.8 కోట్లు ఇచ్చి అట్టి పెట్టుకుంది... అయితే ఈ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది...

510

అలాగే ప్యాట్ కమ్మిన్స్‌ని వేలంలో రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించిన ప్యాట్ కమ్మిన్స్‌ని కూడా బౌలింగ్ పర్ఫామెన్స్ బాగోలేదని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది కేకేఆర్...

610

మొత్తంగా ముగ్గురు ప్లేయర్ల కోసం దాదాపు రూ.24 కోట్లు ఖర్చు చేసిన కేకేఆర్, వారిని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసిందంటే టీమ్ మేనేజ్‌మెంట్, ప్లేయర్ల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అర్థం అవుతుందని అంటున్నారు నెటిజన్లు...

710
venkatesh Iyer

గత సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిల కారణంగానే ఫైనల్‌లోకి దూసుకెళ్లింది కేకేఆర్. వారి మీద నమ్మకంతో రిటైన్ చేసుకున్న కేకేఆర్, కొన్ని మ్యాచుల్లో పర్ఫామెన్స్ బాగోలేదని పక్కనబెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

810

రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ప్లేయర్లను ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకోలేకపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్ మేనేజ్‌మెంట్, వరల్డ్ మేనేజ్‌మెంట్ అంటున్నారు నెటిజన్లు..

910

ప్లేయర్లపై నమ్మకం ఉంచి, వారి నుంచి 100 శాతం రిజల్ట్ ఎలా రాబట్టాలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లను చూసి నేర్చుకోవచ్చని, స్టార్లను టీమ్‌లో పెట్టుకుని కూడా వారిని ఎలా వాడాలో తెలియని టీమ్ గురించి రాయాలంటే కేకేఆర్‌ని చూపిస్తే సరిపోతుందని ట్రోల్స్ చేస్తున్నారు... 

1010

కేకేఆర్ కూడా మరో ఆర్‌సీబీలా తయారయ్యిందని, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి వేరే జట్లకి వెళితే అద్భుతంగా రాణిస్తారని అంటున్నారు నెటిజన్లు... వరుసగా ఫెయిల్ అవుతున్నా మళ్లీ మళ్లీ ఛాన్సులు ఇచ్చే ఆర్‌సీబీతో, కేకేఆర్‌ని పోల్చడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు..

click me!

Recommended Stories