అశ్విన్ మామూలోడు కాదు, ఆ రూల్ కూడా మార్చేశాడు... భారత స్పిన్నర్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ పోస్ట్...

Published : May 02, 2022, 07:39 PM IST

క్రికెట్‌లో రూల్స్ గురించి మాట్లాడాలంటే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తర్వాతే ఎవ్వరైనా! 2019 సీజన్‌లో జోస్ బట్లర్ మాన్కడింగ్ రనౌట్ విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి క్రికెట్ రూల్‌ని మార్చే పనిలో పడ్డాడు రవిచంద్రన్ అశ్విన్...  

PREV
18
అశ్విన్ మామూలోడు కాదు, ఆ రూల్ కూడా మార్చేశాడు... భారత స్పిన్నర్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ పోస్ట్...

2019 సీజన్‌లో జోస్ బట్లర్, మన్కడింగ్ విధానం ద్వారా రనౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకుముందు కపిల్ దేవ్‌తో సహా చాలామంది ఈ విధానంలో బ్యాటర్లను అవుట్ చేసినా... అశ్విన్ చేసిన పనిని తప్పుబట్టారు చాలామంది మాజీ క్రికెటర్లు...

28

ఆ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని ట్రోల్ చేశారు మాజీలు. అయితే తాను చేసిన పని, క్రికెట్ రూల్‌కి విరుద్ధం కాదని వాదించాడు అశ్విన్...

38

అశ్విన్ వాదనను నిజం చేస్తూ ‘మన్కడింగ్’ని క్రికెట్ పుస్తకంలో అఫిషియల్ రనౌట్‌గా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. దీంతో అశ్విన్‌ని తప్పని వాదించిన వారంతా నోరు మూసుకోవాల్సి వచ్చింది...

48

తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్, రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే...

58

9 మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించి 77 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

68

సాధారణంగా బౌలర్లు, లైన్ మీద కాలు పెట్టి బౌలింగ్ చేస్తున్నాడు. లైన్ దాటి నో బాల్‌గా అదనపు పరుగును సమర్పించుకుంటూ ఉంటారు. అయితే అవ్విన్ మాత్రం లైన్‌కి చాలా దూరం నుంచి బౌలింగ్ చేస్తూ కనిపించాడు...

78

ఇలా 22 యార్డ్‌కి మరో రెండు యార్డులు జత చేయడం వల్ల బంతికి గాల్లో ఉండేందుకు మరింత సమయం పడుతుంది. దీంతో స్పిన్‌కి, లెంగ్త్‌ మరికాస్త సమయం దొరుకుతుంది...

88

‘క్రికెట్ అనేది 22 గజాల మధ్యలో ఆడాలని ఎవరు చెప్పారు. చూడండి రవి అశ్విన్ కొత్త పద్ధతి కనిపెట్టాడు. గాల్లో బంతి మరింత సమయం ఉండేందుకు ఎక్స్‌ట్రా ఇచ్చాడు. పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లకు ఉండే ఆప్షన్లు చాలా తక్కువ. కాని కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటూ వెళ్లడం చాలా అవసరం...’ అంటూ ట్వీట్ చేసింది ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు...

click me!

Recommended Stories