టీమిండియా నుంచి ఐపీఎల్‌లోకి... కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్...

Published : Jan 15, 2022, 01:28 PM IST

ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం కామన్, అదే భారత జట్టు నుంచి ఐపీఎల్‌లోకి వెళితే... అదే వెరైటీ! ప్లేయర్ల విషయంలో ఇది చాలా కష్టం కానీ కోచ్‌ల విషయంలో కాదు... 

PREV
19
టీమిండియా నుంచి ఐపీఎల్‌లోకి... కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్...

రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ అరుణ్. ఆయన టీమిండియా తరుపున ఆడింది రెండు టెస్టులు, నాలుగు వన్డేలు మాత్రమే...

29

అయితే విజయవాడలో పుట్టిన భరత్ అరుణ్‌కి ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో 110 వికెట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినా తమిళనాడు తరుపున దేశవాళీ టోర్నీలు ఆడాడు భరత్ అరుణ్...

39

టీమిండియాకి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన భరత్ అరుణ్, ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, షమీ వంటి ప్లేయర్లు... భరత్ అరుణ్ కోచింగ్‌లో రాటు తేలారు...

49

ఈ పర్ఫామెన్స్ కారణంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు భరత్ అరుణ్. వచ్చే సీజన్‌లో కేకేఆర్ జట్టులో చేరనున్నాడాయన...

59

‘టీమిండియాకి బౌలింగ్ కోచ్‌గా చేసిన భరత్ అరుణ్ లాంటి అనుభవం ఉన్న కోచ్‌ మా జట్టులో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అనుభవం, కేకేఆర్‌కి చాలా ఉపయోగపడుతుంది. నైట్ రైడర్స్ కుటుంబంలోకి మీకు స్వాగతం...’ అంటూ ట్వీట్ చేశాడు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్...

69

గత రెండు సీజన్లలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కేల్ మిల్స్, కేకేఆర్ జట్టుకి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్యాట్ కమ్మిన్స్, లూకీ ఫర్గూసన్, ఆండ్రే రస్సెల్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్లు కేకేఆర్‌ తరుపున అద్భుతంగా రాణించారు... 

79

గత సీజన్‌లో ఫస్టాఫ్‌లో ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్, సెకండాఫ్‌లో అనూహ్య విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తుదిపోరులో సీఎస్‌కే చేతుల్లో ఓడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

89

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా ఆల్‌రౌండర్లు ఆండ్రే రస్సెల్‌, వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్‌లతో పాటు యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని అట్టిపెట్టుకుంది కేకేఆర్...

99

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్లుగా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్‌లతో పాటు వేలంలో రూ.15.50 కోట్లు పెట్టి కొన్న ప్యాట్ కమ్మిన్స్‌ని కూడా వేలానికి వదిలేసింది...

click me!

Recommended Stories