ఆ గొడవ తర్వాతే గెలుస్తామనే నమ్మకం వచ్చింది, వాళ్లు ఆ బిజీలో ఉంటే... సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్...

First Published Jan 15, 2022, 11:50 AM IST

కేప్ టౌన్‌ టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ డీఆర్‌ఎస్ విషయంలో తీవ్రమైన వివాదం రేగింది. బాల్ ట్రాకింగ్‌ను తప్పుగా వాడి, మ్యాచ్ గెలవడం కోసం ఛీటింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు భారత ప్లేయర్లు... 

212 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా, 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు...

వెంటనే సౌతాఫ్రికా కెప్టెన్ డీఆర్‌ఎస్ తీసుకోవడం, రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి...

‘ఆ టైంలో మాకు కాస్త ఫ్రీ టైం దొరికింది. ముఖ్యంగా టీమిండియా ఒత్తిడికి గురవుతున్నట్టు మాకు అర్థమైంది. వికెట్లు పడకుండా కాపాడుకుంటే చాలని, వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చని నిర్ణయించుకున్నాం...

నిజానికి అప్పటిదాకా టార్గెట్‌ పైన ఫోకస్ పెట్టలేదు, ఆ కాంట్రవర్సీ తర్వాత ఇంకా ఎన్ని పరుగులు కావాలనే దానిపై దృష్టి పెట్టాం... అది బాగా వర్కవుట్ అయ్యింది...

నిజానికి వాళ్లు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అందుకే కాస్త తీవ్రంగా స్పందించారు. అయితే మా బ్యాటింగ్‌ మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది...

మొదటి టెస్టు ఓడిపోతామని ఊహించలేదు. రెండో మ్యాచ్ నుంచే బౌలర్లపై మరింత బాధ్యతను పెంచాం. వాళ్లు అనుకున్నట్టుగా రాణించారు. అందుకే సిరీస్ గెలవగలిగాం...

వండరర్స్‌లో జరిగిన రెండో టెస్టులో దక్కిన విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మా బ్యాటింగ్‌పైన నమ్మకం పెంచింది. అదే మూడో టెస్టులోనూ కనిపించింది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్...

సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో 113 పరుగుల తేడాతో ఓడిన సౌతాఫ్రికా, ఆ తర్వాత జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో, కేప్ టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది...

వరుసగా రెండు మ్యాచుల్లో 200+ టార్గెట్‌ను ఛేదించి విజయాన్ని అందుకుంది సౌతాఫ్రికా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు  200+ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడిపోవడం ఇదే మొదటిసారి... 
 

click me!