ఇలా అయితే ఫైనల్ చేరడం కష్టమే... ఇంగ్లాండ్, టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లకి ఆ విషయంలో...

First Published Jan 15, 2022, 12:36 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 సీజన్‌లో ఫైనల్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కూడా ఆఖరి దాకా తుదిపోరుకి అర్హత సాధించేందుకు పోటీలో నిలిచాయి...

కరోనా కారణంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టూర్‌ను వాయిదా వేసుకోవడంతో లక్కీగా ఫైనల్ చేరిన న్యూజిలాండ్, టేబుల్ టాపర్ ఇండియాను ఓడించి... ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది...

కరోనా కారణంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 సీజన్‌లో చాలా మ్యాచులు రద్దు కావడంతో పాయింట్ల పద్ధతిలో కాకుండా విజయాల శాతం ప్రామాణికంగా ఫైనల్ చేరే జట్లను నిర్ణయించింది ఐసీసీ...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల విధానంలో, విజయాల శాతం లెక్కింపులో అనేక లోపాలు ఉండడంతో ఈసారి గణాంక విధానంలో అనేక మార్పులు కూడా ప్రవేశపెట్టింది....

సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది...

మూడు టెస్టుల్లో రెండు టెస్టులు గెలిచిన సౌతాఫ్రికా, టీమిండియాని అధిగమించి 66.66 విజయాల శాతంతో టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది...

వర్షం కారణంగా నాటింగ్‌హమ్ టెస్టు డ్రాగా ముగియడం, ఆఖరి వికెట్ తీయలేని కారణంగా కాన్పూర్ టెస్టు కూడా డ్రా కావడం... టీమిండియా విజయాల శాతంపై తీవ్రంగా ప్రభావం చూపించాయి...

ప్రస్తుతం 4 టెస్టు విజయాలు, 3 పరాజయాలు, 2 డ్రా మ్యాచులతో ఉన్న భారత జట్టు... ప్రస్తుతం 49.7 విజయాల శాతంతో ఉంది. టీమిండియాకి స్లో ఓవర్ కారణంగా 3 పెనాల్టీ పాయింట్లు కూడా ఉన్నాయి...

ఇప్పటిదాకా 2 టెస్టులు మాత్రమే ఆడి, రెండింట్లో విజయాలు అందుకున్న శ్రీలంక టాప్‌లో ఉంటే, యాషెస్ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టులు గెలిచి, ఓ మ్యాచ్ డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది...

టెస్టులు గెలిచి, ఓ మ్యాచ్ డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది...
3 విజయాలు, ఓ పరాజయాన్ని అందుకున్న పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంటే, టీమిండియాతో టెస్టు సిరీస్ ఓడిన న్యూజిలాండ్... ఓ విజయం, ఓ డ్రా, రెండు పరాజయాలతో ఆరో స్థానంలో ఉంది...

టీమిండియాని లీడ్స్‌లో ఓడించి, ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు... యాషెస్ సిరీస్‌లో మూడు మ్యాచులు, భారత్‌తో రెండు మ్యాచులు ఓడి... 5 పరాజయాలు, 2 డ్రాలతో ఆఖరి స్థానంలో ఉంది...

ఇంగ్లాండ్ ఖాతాతో కేవలం 10 పాయింట్లు ఉంటే, విజయాల శాతం 10.41గా ఉంది. అదీకాకుండా స్లో ఓవర్ రేటు కారణంగా ఇంగ్లాండ్‌కి 10 పెనాల్టీ పాయింట్లు కూడా ఉన్నాయి...

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఫైనల్‌ పోటీలో నిలవాలంటే కూడా వచ్చే ఏడాదిన్నర అద్భుతమైన విజయాలు అందుకోవాల్సి ఉంటుంది... లేదంటే 8వ స్థానం నుంచి టాప్ 2లోకి రావడం అంత తేలికయ్యే విషయం కాదు..

వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడుతుంది. వాటిల్లో వన్‌సైడ్ విజయాలు అందుకుంటే, టీమిండియా పాయింట్ల పట్టికలో పైకి వెళ్తుంది...

click me!