తెరవకపోతే డోర్ బద్ధలుకొట్టేయ్! సూర్యకుమార్ యాదవ్‌కి రోహిత్ శర్మ ఇచ్చిన సలహా వింటే...

Published : Apr 20, 2022, 04:16 PM IST

ఐపీఎల్‌లో నిలకడైన పర్ఫామెన్స్ చూపించి, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. వరుసగా మూడు సీజన్లలో 400+ పరుగులు చేసినా, సూర్యకుమార్ యాదవ్‌కి సెలక్టర్ల నుంచి పిలుపు రాకపోవడంపై ఫ్యాన్స్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా...

PREV
18
తెరవకపోతే డోర్ బద్ధలుకొట్టేయ్! సూర్యకుమార్ యాదవ్‌కి రోహిత్ శర్మ ఇచ్చిన సలహా వింటే...

ఐపీఎల్ 2008 సీజన్‌లో 512 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 2019 సీజన్‌లో 424, 2020 సీజన్‌లో 480 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...  అయినా 2020 ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కలేదు.

28

‘ఐపీఎల్ 2020 సీజన్‌లో నా పుట్టినరోజు ముంబై ఇండియన్స్‌లో సెలబ్రేట్ చేసుకున్నా. ఆ రోజు రోహిత్, నా దగ్గరికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు... ఇలాగే కష్టపడుతూ ఉండమని చెప్పాడు...

38
Suryakumar Yadav

నీకు త్వరలోనే ఇండియా క్యాప్ లభిస్తుందని భరోసా ఇచ్చాడు. రోహిత్ ఎప్పుడూ నాకు అండగా నిలిచాడు, పరుగులు చేసేలా ప్రోత్సహించాడు... 

48

నేను ఈ మ్యాచ్‌లో బాగా ఆడితే, తర్వాతి మ్యాచ్‌లో మరింత బాగా ఆడాలని చెప్పేవాడు. ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను...

58

ఇంత చేసినా, ఎంత బాగా ఆడినా పట్టించుకోకపోవడంతో నిరాశ చెందా. అప్పుడు రోహిత్... తలుపు తెరిచేదాకా కొడుతూనే ఉండాలి... అయినా తెరవకపోతే అప్పుడు డోర్‌నే విరగ్గొట్టాలి... అని చెప్పాడు...

68
Suryakumar Yadav

ఆ మాటలు నేనెప్పటికీ మరిచిపోను. ఐపీఎల్‌లోనే కాదు, రంజీ ట్రోఫీ 2010-11 సీజన్‌లో నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు, నాతో పాటు బ్యాటింగ్ చేస్తున్నాడు రోహిత్ శర్మ...

78

ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోహిత్ యాటిట్యూడ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. నేను కళ్లు మూసుకుని, రోహిత్ గురించి ఆలోచిస్తే. 2010లో నాతో కలిసి రంజీ మ్యాచ్ ఆడిన ప్లేయర్లే గుర్తుకు వస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్... 

88

ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు సూర్యకుమార్ యాదవ్. నిలకడైన ప్రదర్శనతో టూ డౌన్ ప్లేయర్‌గా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories