ధోనీ చెప్పినా వినడు, తన పర్ఫామెన్స్ కంటే అదే ముఖ్యం... మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కామెంట్స్...

Published : Apr 20, 2022, 03:10 PM IST

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. 2011లో మాహీ కెప్టెన్సీలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో భారత హెడ్ కోచ్‌గా ఉన్నాడు గ్యారీ కిర్‌స్టన్. వరల్డ్ కప్ విజయం తర్వాత ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌తో పాటు కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ని కూడా భుజాలపై ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకుంది భారత జట్టు...

PREV
19
ధోనీ చెప్పినా వినడు, తన పర్ఫామెన్స్ కంటే అదే ముఖ్యం... మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కామెంట్స్...

మూడు సార్లు ఐసీసీ టైటిల్స్ గెలిచినా, పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడని ఎమ్మెస్ ధోనీ... విన్నింగ్ ఫోటో ఫోజుల్లో ఓ మూలన నిలబడతారు... మాహీ గురించి, మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు...

29

‘మాహీ పక్కా టీమ్ ప్లేయర్. అతను ఓ గొప్ప లీడర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అతని ధ్యాస ఎప్పుడూ టీమ్ పర్ఫామెన్స్‌పైనే ఉంటుంది...

39
Gary Kirsten

కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక మాహీలో చాలా మార్పు వచ్చింది. ముందు టీమ్, తర్వాతే నేను... అనుకునే మైండ్ సెట్ మాహీది. అయితే మాహీ తన పర్ఫామెన్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు...

49

ధోనీకి ఈ విషయం గురించి చాలా సార్లు చెప్పి చూశా, కానీ అతను ఎవ్వరి మాట పట్టించుకోడు. టీమ్‌ని ఎలా నడిపించాలి, ఎలా గెలిపించాలో అనే విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు...

59

అతని చుట్టూ ఓ ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. మనం ఆ వాతావరణాన్ని అర్థం చేసుకుని మన పని చేసుకుంటూ పోవాలంతే... అందుకే నేను కూడా మాహీకి బ్యాటింగ్ మీద ఫోకస్ చేయమని చెప్పడం మానేశా...

69
Gary Kirsten

అతనికి ఉన్న టాలెంట్‌కి, పవర్‌కి బ్యాటింగ్‌పైన పూర్తి ఫోకస్ పెట్టి ఉంటే... చాలా గొప్ప బ్యాట్స్‌మెన్ అయ్యేవాడు. రికార్డులన్నీ తిరగరాసేవాడేమో.. 

79

పెద్దగా అనుభవం లేని జూనియర్ టీమ్‌ని నడిపించే సీనియర్‌తో పోలిస్తే, సీనియర్ ప్లేయర్లను నడిపించే జూనియర్... లీడర్‌షిప్ వేరుగా ఉంటుంది. మాహీకి ఈ రెండూ బాగా తెలుసు...

89

సీనియర్ ప్లేయర్లకు కావాల్సిన స్వేచ్ఛని ఇచ్చేవాడు మాహీ. జూనియర్లకు కావాల్సిన మార్గనిర్ధేశం చేసేవాడు. అందుకే మాహీకి బ్యాటింగ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన సమయం కానీ, అవసరం కానీ లేకుండా పోయింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్...

99

ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు గ్యారీ కిర్‌స్టన్. భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా, గుజరాత్ టైటాన్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories