రోజురోజుకీ పడిపోతున్న ఐపీఎల్ 2022 వ్యూయర్‌షిప్... దాన్ని తీసేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్...

Published : Apr 20, 2022, 02:13 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ ఆశలే పెట్టుకుంది బీసీసీఐ. అయితే ఆ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కారణాలేమైనా ఐపీఎల్ 2022 సీజన్‌కి అనుకున్నంత వ్యూయర్‌షిప్ అయితే రావడం లేదు...  

PREV
110
రోజురోజుకీ పడిపోతున్న ఐపీఎల్ 2022 వ్యూయర్‌షిప్... దాన్ని తీసేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్...

కరోనా కాలంలో ఎన్నో అవరోధాలను అధిగమించి నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్‌ సూపర్ సక్సెస్ సాధించింది. ప్రేక్షకులు లేకుండా 2021 సీజన్‌ని రెండు ఫేజ్‌లుగా నిర్వహిస్తే... 2020 సీజన్ కంటే డబుల్ టీఆర్పీ వచ్చింది...

210

గత రెండు సీజన్లకు వచ్చిన రెస్సాన్స్ చూసి ఐపీఎల్ 2022 సీజన్‌ను 10 జట్లతో 74 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే మెగా వేలం కారణంగా ముక్కలైన స్టార్ టీమ్స్, ఈసారి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి..

310

ఆర్‌సీబీ, ఐపీఎల్ 2022 సీజన్ ఫస్టాఫ్‌లో నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్నా... భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి...

410

ఈ రెండు జట్లూ కలిసి ఇప్పటిదాకా 12 మ్యాచులు ఆడితే గెలిచింది ఒకే ఒక్కటి. దీంతో ఈ ఎఫెక్ట్‌ టీఆర్పీపై ఘోరంగా పడుతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌తో పోలిస్తే 2022 సీజన్ టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయింది...

510

మొదటి వారం ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం కారణంగా ఐపీఎల్‌ను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో టీఆర్పీ 30 శాతం పడిపోగా... రెండో వారంలోనూ ఐపీఎల్‌ రేటింగ్ పుంజుకోలేదు...

610

మూడో వారంలో ‘కేజీఎఫ్ 2’ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచులను చూసేవారి సంఖ్య పెరగడం లేదు సరికదా.. రోజురోజుకీ పడిపోతోంది...
 

710

ఐపీఎల్ 2021 సీజన్‌ సమయంలో ఒక్కో మ్యాచ్‌నీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సగటున 2 నుంచి 5 మిలియన్ల వరకూ వీక్షించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. గరిష్టంగా 50- 60 లక్షల మంది ఐపీఎల్ మ్యాచులను లైవ్ వీక్షిస్తుంటే,  కనిష్టంగా ఆ సంఖ్య 30 లక్షల్లోనే ఉంటోంది...

810

ఐపీఎల్ వ్యూయర్‌షిప్ అంతకంతకీ పడిపోతూ ఉండడంతో రియల్ టైమ్ వ్యూయర్స్‌ని డిసేబుల్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. మొత్తంగా తీసేయకుండా కొన్ని సార్లు తక్కువగా ఉన్నప్పుడు కనిపించకుండా... కాస్త పెరిగిన తర్వాత కనిపించేలా మార్పులు తీసుకొచ్చింది...
 

910

ఐపీఎల్ 2020 సీజన్‌ సూపర్ హిట్ కావడానికి సూపర్ ఓవర్ మ్యాచులు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సీజన్‌లో అలాంటి ఒకటి రెండు మ్యాచులు పడితే, వ్యూయర్‌షిప్, టీఆర్పీ మళ్లీ పెరుగుతాయని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..

1010

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2022 సీజన్‌ సూపర్ హిట్టు అవుతుందా? లేక యావరేజ్‌గా నిలుస్తుందా? అనేది తేలిపోనుందని అంటున్నారు ఫ్యాన్స్... 

Read more Photos on
click me!

Recommended Stories