సన్‌రైజర్స్‌కి తెగతెంపులే, కొత్తగా మొదలెడతానంటున్న డేవిడ్ వార్నర్... వార్నర్ భాయ్ కోసం ఆ నాలుగు జట్లూ...

First Published Oct 28, 2021, 7:21 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ని డేవిడ్ వార్నర్ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేడేమో. తన ఫెవరెట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తీవ్ర పరాభావన్ని, అవమానాలను ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్, అందరూ ఊహించినట్టే ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త జట్టుకి ఆడబోతున్నట్టు ప్రకటించేశాడు...

కెప్టెన్‌గా ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి టైటిల్ అందించాడు డేవిడ్ వార్నర్. ఆ సీజన్‌లో 800+పైగా పరుగులు చేసి, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

‘ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ ఇద్దరూ నాకంటే బాగా ఆడుతున్నారు. నా కంటే బాగా బ్యాటును బంతి మధ్యలో నుంచి కొట్టగలుగుతున్నారు. వారికి అవకాశం ఇవ్వడమే కరెక్ట్...

ఓ ప్రొఫెషనల్ అథ్లెట్‌గా జట్టు ఇచ్చే ప్రతీ దాన్ని చిరునవ్వుతో స్వీకరించాల్సి ఉంటుంది. జట్టుతో ఉన్నప్పుడు డ్రింక్స్ మోయడానికి కూడా నేనెప్పుడూ సిగ్గు పడలేదు...

అయితే నన్ను ఎందుకు కెప్టెన్సీ నుంచి తొలగించారనే విషయంపై నాకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. ఐపీఎల్ 2022 వేలంలో నా పేరు పెడతాను. సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు చూస్తుంటే నన్ను రిటైన్ చేసుకోవడం వాళ్లకి ఏ మాత్రం ఇష్టం లేనట్టే ఉంది...

అందుకే నేను కొత్తగా మొదలెట్టాలని చూస్తున్నా... ఐపీఎల్ 2022 వేలంలో రిజిస్టర్ చేయించుకోబోతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్...

2009 నుంచి 13 వరకూ ఢిల్లీ జట్టుకి ఆడిన డేవిడ్ వార్నర్, 2014 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2014లో ఎస్‌ఆర్‌హెచ్‌కి ఆడిన మొదటి సీజన్‌లో 528 పరుగులు చేసిన వార్నర్, ఆ తర్వాతి సీజన్‌లో కెప్టెన్‌గా 562 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు...

2016లో 848 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి టైటిల్ సాధించాడు. 2017 సీజన్‌లో 541 పరుగులు, 2019లో 692 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వార్నర్...

గత సీజన్‌లో 548 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌ ఫస్టాఫ్‌లో 6 మ్యాచుల్లో 194 పరుగులు చేసిన వార్నర్, రెండు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు...

అయితే జట్టు సెలక్షన్‌పై వార్నర్ మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేయడం, టీమ్ మేనేజ్‌మెంట్‌కి కోపాన్ని తెప్పించింది. దీంతో ఐదు సీజన్‌లలో టాప్ స్కోరర్‌గా ఉన్న వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఆ తర్వాత టీమ్‌లో నుంచి కూడా తీసేసని సన్‌రైజర్స్, కొన్ని మ్యాచులు చూడడానికి కూడా అతనికి అవకాశం కల్పించలేదు. మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వద్దామంటే కూడా తనని అనుమతించలేదని వార్నర్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి...

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగువారికి చాలా దగ్గరయ్యాడు. వార్నర్ భాయ్‌ అంటూ సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్‌ను ముద్దుగా పిలుస్తారు. తన అభిమానుల కోసమే ఎన్నో తెలుగు పాటలకు డ్యాన్సులు చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు వార్నర్...

డేవిడ్ వార్నర్ లాంటి బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కోసం ఐపీఎల్ 2022 వేలంలో చాలాజట్లు పోటీపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన రెండు కొత్త జట్లతో పాటు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ వార్నర్ కోసం బిడ్ వేసే ఛాన్సులు ఉన్నాయి...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. అలాగే రాజస్థాన్ రాయల్స్‌లో బెన్ స్టోక్స్, ఆర్చర్, బట్లర్ వంటి ఇంగ్లాండ్ క్రికెటర్లు తప్ప పెద్దగా విదేశీ స్టార్లు లేరు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్లు సరిగా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంది రాజస్థాన్ రాయల్స్. అందుకే వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు రాజస్థాన్ ఆసక్తి చూపించొచ్చు...

అలాగే పంజాబ్ కింగ్స్ కూడా కెఎల్ రాహుల్ కెప్టెన్సీతో సంతోషంగా లేదు. రాహుల్ కూడా ఆర్‌సీబీలోకి వెళ్లాలని చూస్తున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌కి కూడా కొత్త కెప్టెన్ అవసరం పడింది...

click me!