IPL 2022 మెగా వేలం రూల్స్ ఇవే... నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు అవకాశం...

First Published | Oct 28, 2021, 6:19 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనబోయే రెండు కొత్త జట్ల ఏవో తేలిపోయింది. అహ్మదాబాద్, లక్నో సిటీల పేర్లతో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనుండడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 ఫ్రాంఛైజీలు టైటిల్ పోరులో తలబడబోతున్నాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. ఈ వేలానికి ముందు రిటెన్షన్ పాలసీ గురించి ఇంకా స్పష్టమైన క్లారిటీ రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది...

తాజాగా ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సమాచారం ప్రకారం ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు 8 ఫ్రాంఛైజీలకు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది...


ఫ్రాంఛైజీల వెసులుబాటును బట్టి ముగ్గురు భారత ప్లేయర్లు, ఓ విదేశీ ప్లేయర్ లేదా... ఇద్దరు స్వదేశీ ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది...

ఐపీఎల్ వేలంలో వాడే రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు మాత్రం ఈ సారి అందుబాటులో ఉండడం లేదు. ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా వేలంపాటలో వేరే జట్టు దక్కించుకున్న ప్లేయర్‌ని, అదే రేటుకి పాత ఫ్రాంఛైజీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశం ఫ్రాంఛైజీలకు ఉండదు... 

అలాగే రిటెన్షన్ పాలసీ వల్ల ఐపీఎల్‌లో కొత్తగా వచ్చిన అహ్మదాబాద్, లక్నో జట్లకి నష్టం కలగకుండా ఉండేందుకు వేలానికి ముందే ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు కొత్త జట్లకి అవకాశం కల్పించనుంది...

అయితే ప్రస్తుతం ఉన్న ఫ్రాంఛైజీలు ఈ ఐడియాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాత ఫ్రాంఛైజీలు ప్లేయర్లను వేలానికి వదిలేసి, మళ్లీ వేలంలో ఆ ప్లేయర్‌ను కొనుగోలు చేయాలని భావించొచ్చు. కొత్త జట్లకి వేలానికి ముందే ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తే, పాత ఫ్రాంఛైజీలకు ఆ అవకాశం ఉండదు...

ఐపీఎల్ 2022 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ పర్సులో రూ.90 కోట్లు ఉంటాయి. ఇంతకుముందు ఈ వాల్యూ రూ.85 కోట్లు ఉండగా మరో రూ.5 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

ఆర్‌పీ సంజీవ్ గోయింకా గ్రూప్ లక్నో జట్టును రూ.7090 కోట్లకు కొనుగోలు చేయగా, అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ రూ.5625 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!